Home ఆంధ్రప్రదేశ్ వార్తలు కడప జైలులో 19 మంది ఖైదీలకు కరోనా

కడప జైలులో 19 మంది ఖైదీలకు కరోనా

Corona Positive To 19 Prisoners In Kadapa Central Jailకడప : ఎపిలోని కడప జిల్లా సెంట్రల్ జైలులో 19 మంది ఖైదీలకు కరోనా సోకింది. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డిఐజి వరప్రసాద్ తెలిపారు. కరోనా సోకిన ఖైదీలను జైలు ప్రాంగణంలోని క్వారంటైన్ ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. భద్రతా కారణాలతో కరోనా బాధితులను ఆసుపత్రికి తరలించలేదని ఆయన పేర్కొన్నారు. కరోనా బారిన పడిన ఖైదీలకు నాణ్యమైన భోజనంతో పాటు పాలు, డ్రై ప్రూట్స్ ఇస్తున్నామని ఆయన చెప్పారు. కడప జైలులో ఉన్న 700 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు చేస్తామని ఆయన తెలిపారు. కొంతమంది ఖైదీలు జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకుల్లో పని చేస్తున్నారు. దీంతోనే బయట వ్యక్తుల నుంచి ఖైదీలకు కరోనా సోకినట్టు గుర్తించారు. 19 మంది ఖైదీలకు కరోనా సోకడంతో మిగిలిన ఖైదీలు ఆందోళనకు గురవుతున్నారు. కడప జిల్లాలో ఇప్పటి వరకు 14,640 మంది కరోనా బారిన పడ్డారు. 8,955 మంది కోలుకోగా, మిగిలిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.