రాజస్థాన్ : ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి కరోనా సోకింది. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో చోటు చేసుకుంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆ కుటుంబ సభ్యులకు పరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. వీరు జైపూర్‌లోని సుభాష్ చౌక్ ప్రాంతానికి చెందిన వారని అధికారులు చెప్పారు. రాజస్థాన్‌లో అత్యధిక కరోనా కేసులు జైపూర్‌లోనే నమోదవుతున్నాయి. జైపూర్ తరువాత కోట, జోథ్‌పూర్‌లలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు రాజస్థాన్‌లో 11,000 కరోనా కేసులు నమోదయ్యాయి. 251 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ప్రభుత్వం పెట్టిన నిబంధనలను పాటించాలని, బయటకొచ్చినప్పుడు భౌతిక దూరం పాటించడంతో పాటు విధిగా మాస్క్‌లు ధరించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. స్వీయ రక్షణతోనే కరోనాను కట్టడి చేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు.