Home జాతీయ వార్తలు ఎంపి నవనీత్‌ కౌర్‌కు కరోనా పాజిటివ్‌

ఎంపి నవనీత్‌ కౌర్‌కు కరోనా పాజిటివ్‌

Corona Positive To Amravati MP Navneet Kaurముంబయి : అమరావతి ఎంపి, నటి నవనీత్ కౌర్ కు కరోనా సోకింది. ఆమెతో పాటు ఆమె భర్త రవి రానా, ఆమె పిల్లలకు కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. తమ కుటుంబం కరోనా బారిన పడినట్టు నవనీత్ కౌర్ స్వయంగా వెల్లడించారు. ముందుగా ఆమె కొడుకు, కూతురుకు కరోనా వచ్చింది. దీంతో నవనీత్ కౌర్, ఆమె భర్త పరీక్షలు చేయించుకోగా, వారికి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో వారు నాగపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నవనీత్ కౌర్ తెలుగు ప్రేక్షకులకు తెలిసినవారే. శీను వాసంతి లక్ష్మి సినిమాతో ఆమె టాలీవుడ్ కు పరిచయమయ్యారు. రూమ్ మేట్స్, జగపతి తదితరు సినిమాల్లో నటించారు. యమదొంగలో ఎన్ టిఆర్ తో కలిసి ఆమె ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. పంజాబీ, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లో ఆమె  నటించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె మహారాష్ట్రలోని అమరావతి నుంచి లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.