Home జాతీయ వార్తలు కర్ణాటక సిఎం యడ్యూరప్పకు కరోనా పాజిటివ్‌

కర్ణాటక సిఎం యడ్యూరప్పకు కరోనా పాజిటివ్‌

Corona Positive To Karnataka CM Yediyurappaబెంగళూరు : కర్ణాటకలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర సిఎం బిఎస్ యడ్యూరప్పకు కరోనా సోకింది. దీంతో ఆయన బెంగళూరులోని ఓల్డ్‌ ఎయిర్‌పోర్టు రోడ్‌లోని మణిపాల్‌ ఆసుపత్రిలో చేరారు. తనకు కరోనా సోకిన విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారు, తన వ్యక్తిగత సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకోవాలని, హోంక్వారంటైన్ లో ఉండాలని యడ్యూరప్ప సూచించారు. దేశంలో కరోనా సోకిన రెండో సిఎం యడ్యూరప్ప కావడం గమనార్హం. ఇంతకు ముందు మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా సోకింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నాటక మంత్రి బిసి పాటిల్,  ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. అంతేకాదు అటవీశాఖ, పర్యాటక వాఖ మంత్రులు ఆనంద్ సింగ్. సిటి రవికి కూడా కరోనా సోకడంతో వారందూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం  కర్నాటకలో 5,532 మంది కరోనా బారిన పడ్డారు. 84 మంది కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.34 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, 2,496 మంది కరోనాతో చనిపోయారు.