Home తాజా వార్తలు నెహ్రూ జూపార్కులో సింహాలకు కరోనా

నెహ్రూ జూపార్కులో సింహాలకు కరోనా

Corona Positive To Lions In Hyderabad Nehru Zoo Parkహైదరాబాద్: కరోనా జంతువులను కూడా వెంటాడుతోంది. దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ఇటీవల గుజరాత్ గిరి జూపార్కులో సింహాలకు కరోనా పాజిటివ్ రావడం సంచలనమైంది. ఈ క్రమంలో హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో 8 సింహాలకు కరోనా సోకింది.  ఈ 8 సింహాలకు సంబంధించిన శాంపిల్స్ ను పరీక్షల కోసం సిసిఎంబికి పంపించారు. మంగళవారం ఈ సింహాలకు సంబంధించిన రిపోర్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మనుషుల నుంచి జంతువులకు కరోనా వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతోనే నెహ్రూ జూపార్కులోకి సందర్శకుల ప్రవేశాలను నిలిపి వేసినట్టు జూపార్కు అధికారులు తెలిపారు.