Home తాజా వార్తలు ఉస్మానియా వైద్య విద్యార్థిని, మరో యువకుడికి కరోనా పాజిటివ్

ఉస్మానియా వైద్య విద్యార్థిని, మరో యువకుడికి కరోనా పాజిటివ్

Corona Positive to OMC PG student

 

గోషామహల్: ఉస్మానియా వైద్య కళాశాలలో ఇద్దరు వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గైనకాలజిస్ట్ (25), జనర ల్ సర్జరీ ఫైనల్ ఇయర్ పీజీ (28) విద్యార్థులు ఉస్మానియా వైద్య కళాశాలలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతూ.. కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల వసతి గృహంలో ఉంటున్నారు. వీరికి జ్వరం, జలుబు వంటి కరోనా లక్షణాలు కనిపించడంతో వారి నమూనాలు సేకరించి, ల్యాబ్‌కు పంపించగా.. కరోనా పాజిటివ్‌గా ఉన్నట్లు తేలడంతో అధికారులు ఇద్దరు వైద్య విద్యార్థులను చికిత్సల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారితో పాటు ఉంటున్న 33 మంది వైద్య విద్యార్ధులను హోం క్వారంటైప్ చేశారు.

ఉస్మానియా ఆసుపత్రిలో …
ఉస్మానియా ఆసుపత్రి డైట్ క్యాంటీన్‌లో పనిచేసే యువకుడు(25)కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ యువకుడు ఆసుపత్రిలోని వంటశాల (డైట్)లో పని చేస్తూ.. అల్ఫాహారం, భోజనం తయారు చేసి, ఇన్ పేషెంట్లుగా చికిత్సలు పొందుతున్న రోగులతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలు, విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు పంపిణీ చేస్తుంటాడు.

వారం రోజుల క్రితం అతను తన స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లాలోని పెబ్బేరుకు వెళ్లి ఇటీవలే తిరిగొచ్చిన అనంతరం జ్వరం, జలుబు రావడంతో ఉస్మానియా వైద్యులు అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. శనివారం రిపోర్టు రాగా అతనికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించమని, డైట్ క్వాంటీన్‌తో పాటు డాక్టర్స్ క్యాంటీన్‌లో పనిచేసే ఉద్యోగులకు దశల వారీగా పరీక్షలు చేయిస్తామని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ వెల్లడించారు.

Corona Positive to OMC PG student