Thursday, April 25, 2024

శ్వేత సౌధంలో కరోనా మొదటి కేసు..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బృందంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ సంక్రమించినట్టు బయటపడింది. దీంతో అమెరికా శ్వేత సౌధంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఉపాధ్యక్షుని బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు సాయంత్రం గుర్తించడమైందని, అయితే వైరస్ సోకిన వ్యక్తికి అధ్యక్షుడు ట్రంప్‌తోకానీ, పెన్స్‌తో కానీ నేరుగా సన్నిహిత సంబంధాలు లేవని ఉపాధ్యక్షుని ప్రెస్ శెక్రటరీ కేటీ మిల్లర్ ఒక ప్రకటనలో చెప్పారు. ఈ మధ్య కాలంలో ఆయనను కలిసిన వారిని సిడిసి మార్గదర్శకాలు ప్రకారం గుర్తించనున్నట్టు చెప్పారు. గత వారం ట్రంప్ వైరస్ పరీక్షలు చేయించుకోగా, నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. శ్వేత సౌధంలో వ్యక్తుల ప్రవేశంపై కఠిన నిబంధనలు విధించారు. అథ్యక్షుని వైద్యుల బృందం, సీక్రెట్ సర్వీస్ ప్రతివ్యక్తి ఉష్ణోగ్రతలను పరీక్షిస్తున్నారు. శ్వేత సౌథంలో సీట్లు కూడా సామాజిక దూరం ప్రకారం తిరిగి సరి చేశారు.

Corona Positive to Staff member in US Vice President

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News