Home తాజా వార్తలు టాలీవుడ్ దర్శకుడు తేజకు కరోనా

టాలీవుడ్ దర్శకుడు తేజకు కరోనా

Corona Positive To Tollywood Director Tejaహైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు తేజకు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తేజానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవల తేజ ఓ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ యూనిట్ సభ్యుడు ఒకరికి కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో తేజ కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఆయను కూడా కరోనా పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్ లో ఉన్నారు. అందరూ ఇంట్లో ఉంటే, తాను మాత్రం షూటింగ్ కు వెళ్లి కరోనా బారిన పడినట్టు ఆయన వెల్లడించారు. షూటింగ్ యూనిట్ సభ్యులకు, తన కుటుంబ సభ్యులకు కరోనా రాలేదని ఆయన పేర్కొన్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన తన అభిమానులను కోరారు. కరోనా నుంచి తేజ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల దర్శకధీరుడు రాజమౌళితో పాటు ఆయన కుటుంబంలోని పలువురికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండడం టాలీవుడ్ లో భయాందోళనలు నెలకొన్నాయి.