Home జాతీయ వార్తలు కేంద్ర మంత్రి కైలాష్ చౌదరికి కరోనా

కేంద్ర మంత్రి కైలాష్ చౌదరికి కరోనా

Corona Positive To Union Minister Kailash Choudhary ఢిల్లీ: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరికి కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని మంత్రి చౌదరి స్వయంగా వెల్లడించారు. తనను కలిసిన వారు, తనతో కాంటాక్టులో ఉన్న వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నానని, ఈ క్రమంలో తనకు కరోనా వచ్చినట్టు పరీక్షల్లో తేలిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. చౌదరి త్వరగా కోలుకోవాలని ఔరంగాబాద్ బిజెపి ఎంపి సుశీల్ కుమార్ ఆకాంక్షించారు.