Tuesday, April 16, 2024

రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు

- Advertisement -
- Advertisement -

24గంటల్లో దేశవ్యాప్తంగా 4లక్షల20వేల శాంపిళ్లకు టెస్టులు, దేశంలో వైరస్ వెలుగుచూసిన తర్వాత పెద్ద మొత్తంలో
కొవిడ్ టెస్టులు ఇదే తొలిసారి
ఒకే రోజు 48,916 కొత్త కేసులు
31వేలు దాటిన మరణాలు
మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్‌కు పాజిటివ్

Corona test records in india

న్యూఢిల్లీ: ఓ వైపు దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంటే మరో వైపు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా అదే స్థా యిలో పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయి లో 4,20,898 శాంపిళ్లను పరీక్షించినట్లు కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ తెలియజేసింది. దేశంలో వైరసః బైటపడినప్పటినుంచి ఒకే రోజులో భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించడం ఇదే మొదటి సారి. పరీక్షల సంఖ్య భారీగా పెరగడంతో టెస్ట్ ఫర్ మిలియన్( టిపిఎం) కూడా11,485కు చేరుకుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గత వారం రోజులుగా దేశంలో ప్రతి రోజూ 3.5లక్షలకు పైగా పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున ‘ టెస్ట్, ట్రాక్, ట్రీట్’ వ్యూహాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సలహా ఇచ్చిందని, దీనివల్ల మొదట్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినప్పటికీ చివరికి ఢిల్లీ ఎన్‌సిటి పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిపిన కృషి తర్వాత తగ్గినట్లుగా కేసుల సంఖ్య తగ్గుతుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్ శాంపిల్స్ పరీక్షలు పెరగడంతో దేశంలో మరణాల రేటు గణనీయంగా 2.35 శాతానికి పడిపోయిందని, రికవరీ రేటు 63.54 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ తెలియజేసింది. ప్రపంచంలోనే మరణాల రేటు తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని కూడా ఆ ప్రకటన తెలిపింది.
13లక్షలు దాటిన కొవిడ్ కేసులు
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48,916 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్త కేసుల సంఖ్య 13,36,861కి చేరుకుంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య 12 లక్షలనుంచి 13లక్షలకు చేరుకోవడం వైరస్ ఉధృతికి అద్ద పడుతుంది. కాగా మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 8,49,431 మంది కోలుకుని డిశ్చార్జి కాగా మరో 4,56,071మంది చికిత్స పొందుతున్నారు. కాగా కొత్తగా 757 మంది మృతి చెందడంతో మృతుల సంఖ్య 31,358కి చేరుకుంది. కాగా శుక్రవారం ఒక్క రోజే 34,602 మంది వైరస్‌ను జయించి క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని, ప్రస్తుతం అది శనివారం నాటికి 2.35 శాతానికి చేరుకుందని కూడా ఆ ఆశాఖ తెలిపింది. కాగా శనివారం సంభవించిన మరణాల్లో ఒక్క మహారాష్ట్రలోనే 278 మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు అత్యధికంగా 13,132 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా రాష్ట్రంలో అత్యధికంగా 3,57,117 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా ఒకప్పుడు వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్న ఢిల్లీలో ఇప్పుడు మరణాలు గఱనీయంగా తగ్గాయి. శనివారం అక్కడ 32 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రస్తుతం కర్నాటకలో కేసులతో పాటు మరణాలు సైతం భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 108 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 1,724 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు తమిళనాడులో వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 88 మంది మృతి చెందడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3,320కి చేరుకుంది. కాగా కేసులు 2లక్షలకు చేరువైనాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటివరకు 1,348 మంది మరణించగా, కేసలు సంఖ్య 60 వేలు దాటింది.
మధ్యప్రదేశ్ సిఎంకు కరోనా
దేశంలో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి సామాన్యులనుంచి ప్రముఖుల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో మంత్రులు, ఎంఎల్‌ఎలు వైరస్ బారిన పడగా తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.ఈ విషయాన్ని శనివారం ఆయనే ట్విట్టర్‌ద్వారా తెలియజేశారు. దీంతో దేశంలో కరోనా బారిన తోలొ ముఖ్యమంత్రి ఆయన అయ్యారు. ‘ నా ప్రియమైన ప్రజలారా.. నేను కరోనా లక్షణాలు కలిగి ఉన్నాను. పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ గా నివేదిక వచ్చింది’ అని శివరాజ్ సింగ్ ట్వీట్‌లో తెలియజేశారు. డాక్టర్ల సూచన మేరకు తాను నగరంలోని చిరాయు ఆస్పత్రిలో చేరుతున్నట్లు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News