Saturday, April 20, 2024

16 ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతి

- Advertisement -
- Advertisement -

Corona tests

 

న్యూఢిల్లీ : దేశం లోని మరో పది ప్రైవేట్ ల్యాబ్‌లకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసిఎంఆర్ ) అనుమతి మంజూరు చేసింది. దీంతో దేశంలో కరోనా నిర్ధారణకు అనుమతి పొందిన ప్రైవేట్ ల్యాబ్‌ల సంఖ్య 16 కు చేరింది. ఢిల్లీలో 3,గుజరాత్‌లో 2, హర్యానాలో 2, కర్నాటకలో 1, మహారాష్ట్రలో 5, తమిళనాడులో 2 ఉండగా, తెలంగాణ లోని జూబిలీ హిల్స్ లోని అపోలో ఆస్పత్రికి కూడా అనుమతి లభించింది. మహారాష్ట్ర లోని పుణె లో మైలాబ్ డిస్కవరీ తయారు చేసే కరోనా పరీక్ష కిట్‌కు వాణిజ్య పరమైన అనుమతి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఒ) నుంచి లభించింది. . కరోనా నిర్ధారణ పరీక్షకు వసూలు చేయవలసిన మొత్తం 4500గా కేంద్రం ప్రకటించింది. ఇందులో 1500 స్క్రీనింగ్ పరీక్షకు, 3000 నిర్ధారణ పరీక్ష కోసమని కేంద్రం ప్రకటనలో వివరించింది.

Corona tests alloweded in 16 private labs
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News