Home జాతీయ వార్తలు పంజాబ్ మంత్రికి కరోనా

పంజాబ్ మంత్రికి కరోనా

Corona to Punjab Minister Tript Rajinder Singh Bajwaచండీగఢ్ : పంజాబ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ట్రిప్ట్ రజీందర్ సింగ్ బజ్వా(77) కరోనా బారిన పడ్డారు. ఆయన సతీమణి రత్నేశ్వర్ కౌర్,కొడుకుకు కూడా కరోనా సోకింది. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 9న మంత్రికి కరోనా పాజిటివ్ రావడంతో, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయించామని కోవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ రాజేష్ భాస్కర్ తెలిపారు. వీరికి కరోనా సోకడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఈనెల 9న జరిగిన గ్రామీణాభివృద్ధి శాఖ సమావేశానికి మంత్రి బజ్వా అధ్యక్షత వహించగా సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, మంత్రులు సుఖ్జిందర్ సింగ్ రాంధావా, అరుణ చౌదరి, పలువురు కాంగ్రెస్ ఎంఎల్ఎలు హాజరయ్యారు. దీంతో సిఎంతో సహా అందరికీ కరోనా పరీక్షలు చేయించారు. మంత్రి బజ్వా మినహా మిగిలిన వారికి కరోనా నెగిటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 8,799 మంది కరోనా బారిన పడ్డారు. 221 మంది కరోనాతో చనిపోయారు. పంజాబ్ పై కరోనా ఉధృతి కొనసాగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం సూచించిన కరోనా నిబంధనలను పాటిస్తూ రోడ్లపైకి వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించాలని, మాస్క్ లు ధరించాలని ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలకు  అధికారులు సూచిస్తున్నారు.