Home జాతీయ వార్తలు కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కు కరోనా పాజిటివ్

కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కు కరోనా పాజిటివ్

Corona To Union Minister Prahlad Singh Patelఢిల్లీ : ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపిలకు కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటికే సుమారు 30 మంది ఎంపిలు కరోనా బారిన పడ్డట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు కేంద్రమంత్రులు సైతం కరోనా బారినపడ్డారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారిన పడగా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కు కరోనా సోకినట్టు గురువారం నిర్థారణ అయింది. తనకు కరోనా సోకినట్టు ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారు, తనతో సన్నితంగా మెలిగినవారు, తనతో కాంటాక్టులో ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, హోంక్వారంటైన్ లో ఉండాలని ఆయన కోరారు. తాను ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాని, తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వెల్లడించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, బయటకు వచ్చినప్పుడు విధిగా రెండు గజాల సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని ఆయన దేశ ప్రజలను కోరారు.