Home తాజా వార్తలు తెలంగాణలో చురుకుగా కరోనా టీకా డ్రైవ్

తెలంగాణలో చురుకుగా కరోనా టీకా డ్రైవ్

Corona Vaccine Drive In Telanganaహైద‌రాబాద్ : తెలంగాణలో కరోనా టీకా డ్రైవ్ చురుకుగా సాగుతోంది. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి, అర్హులైన వారికి టీకాలు వేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే తెలంగాణలో 5లక్షల మందికి టీకాలు వేశారు. శుక్ర‌వారం రోజు మొత్తం 5,02,519 మందికి టీకాలు వేశారు.  ఇందులో 3,71,169 మందికి మొదటి డోసు, 1,31,350 మందికి రెండో డోసు టీకాలు వేశారు.  ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో 2.36 కోట్ల మందికి టీకాలు వేశారు. ఇందులో 1,71,74,566 మందికి మొదటి డోసు,  64,42,430 మందికి రెండో డోసు టీకాలు వేశారు.