Home తాజా వార్తలు రాష్ట్ర ప్రజలందరికీ టీకాలు : ఎర్రబెల్లి

రాష్ట్ర ప్రజలందరికీ టీకాలు : ఎర్రబెల్లి

Corona Vaccine For All People : Errabelliవరంగల్‌ : వచ్చే  డిసెంబర్ చివరి నాటికి  తెలంగాణ ప్రజలందరికీ టీకాలు వేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హంటర్ రోడ్, విష్ణుప్రియ గార్డెన్స్ లో సూపర్ స్ప్రెడర్స్ కోసం ఏర్పాటు చేసిన టీకా కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనునిత్యం చాలా మందిని కలిసే  సూపర్ స్ప్రెడర్స్ కు ముందుగా టీకాలు ఇవ్వాలని కెసిఆర్ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. కరోనా కట్టడికి కెసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ చొరవ తీసుకోవడం వల్లనే రాష్ట్రంలో టీకాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. ఈ టీకా డ్రైవ్ 20 రోజుల పాటు సాగుతుందని, అర్హులైన ప్రతిఒక్కరు టీకా వేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని ఆయన తేల్చిచెప్పారు. లాక్ డౌన్ నిబంధనలను ప్రతిఒక్కరు పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలని ఆయన స్పష్టం చేశారు.