Thursday, April 25, 2024

మరో 1,82,523 మందికి వ్యాక్సిన్…

- Advertisement -
- Advertisement -

Corona vaccine for another 182523 people in Telangana

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మరో 1,82,523 మందికి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్‌లో పేర్కొంది. వీరిలో 1,75,241 మంది మొదటి డోసు తీసుకోగా, 7282 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 2,50,838 మంది హెల్త్‌కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా, 1,91,975 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 2,65,607 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా, 99,898 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. అదే విధంగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 22,41,003 మంది మొదటి, 3712 మంది రెండో డోసు తీసుకున్నారు. ఇక 45 ఏళ్ల పై బడిన వారిలో 43,93,160 మంది మొదటి, 12,46,068 మంది రెండో డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 71,50,608 మంది తొలి, 15,41,653 మంది రెండో డోసును పూర్తి చేసుకున్నారు. ఇక కొవిన్‌లో నమోదైన 78,09,890 డోసుల్లో 62,970 ఆర్మీకి కేటాయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌లో 78,09,890 డోసులు వినియోగించగా, వ్యాక్సిన్ వేస్టేజ్ 0.15 శాతం తేలింది. ఇదిలా ఉండగా కరోనా నియంత్రణ కేవలం వ్యాక్సిన్‌తోనే సాధ్యమని ఆరోగ్యశాఖ మరోసారి ప్రకటించింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ, వైద్యశాఖ నుంచి అనుమతి పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్ కేంద్రాల్లో టీకా తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ప్రభుత్వ సెంటర్లలో కేవలం హైరిస్క్ గ్రూప్‌లకు తొలి డోసు, అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండో డోసు ఇస్తున్నారు. కానీ ప్రైవేట్‌లో 18 ఏళ్ల పై బడిన వారందరికీ టీకా పంపిణీ జరుగుతోంది. అయితే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన లేని వారు నేరుగా కేంద్రానికి వెళ్లి ఆన్‌సైట్(నేరుగా సెంటర్‌లో నమోదు) రిజిస్ట్రేషన్ విధానంలో టీకా పొందవచ్చని అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా కేసులు కూడా పెరుగుతుండటంతో ప్రయారిటీ గ్రూప్స్( వృద్ధులు, దీర్ఘకాలి వ్యాధిగ్రస్తులు) తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని ఆఫీసర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్షం వహించినా మరోసారి ముప్పు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News