Saturday, April 20, 2024

వచ్చే ఏడాదికి వ్యాక్సిన్ : కేంద్రమంత్రి హర్షవర్ధన్

- Advertisement -
- Advertisement -

Corona Vaccine for next year says Harsh Vardhan

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ప్రారంభానికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తుందని, అందరికీ అందాలంటే ఇంకా మరికొంత సమయం పడుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. ఒకరికి ఒకరు దూరం పాటించడం అన్నది సామాజిక వ్యాక్సిన్‌గా ఆయన అభివర్ణించారు. వ్యాక్సిన్ అందుబాటు గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వ సామర్థాన్ని సమర్ధిస్తూ దేశంలో మొదటి కేసు కనిపించేనాటికి ముందే కరోనా నియంత్రణ చర్యలు చేపట్టినట్టు చెప్పారు. జనవరి 8న వైద్యనిపుణులతో చర్చించి, జనవరి 17న చర్యలు చేపట్టడం ప్రారంభించినట్టు తెలిపారు.

చైనా నుంచి వచ్చిన వైద్య విద్యార్థి కారణంగా జనవరి 20న మొదటి కేసు నమోదైందని, ఈ కేసుకు సంబంధించి కాంటాక్టు ట్రేసింగ్ ద్వారా 162 మందిని కనుగొన్నట్టు తెలిపారు. పిపిఇ కిట్లకు, టెస్టింగ్ కిట్లకు, మాస్క్‌లకు, కొరతగా ఉందని టివి ఛానల్స్ ద్వారా జనం చెప్పిన పరిస్థితి నుంచి చాలా దూరం వచ్చామని, ఇప్పుడు దేశంలో వందలాది ల్యాబ్‌లున్నాయని ఏ రాష్ట్రంపైనా వివక్షత చూపించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.64 శాతం ఉందని, మరణాల రేటును 1 శాతం కంటే దిగువకు తీసుకురావడమే లక్షంగా పెట్టుకున్నామని చెప్పారు.

ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 7879 శాతంగా ఉందని, ప్రపంచం లోనే అతి తక్కువ రికవరీ రేటు కలిగిన దేశం మనదేనని చెప్పారు. దేశంలో పాజిటివ్ కేసులు 50 లక్షలు దాటినప్పటికీ యాక్టివ్ కేసుల సంఖ్య 20 శాతం కంటే తక్కువేనని పేర్కొన్నారు. ఐరోపా దేశాలతో పోలిస్తే కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య దేశంలో తక్కువేనని తెలిపారు. ఎక్కువ టెస్టులు చేసిన అమెరికా కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

Corona Vaccine for next year says Harsh Vardhan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News