Saturday, April 20, 2024

ఇక టీకాలు వేయడమే

- Advertisement -
- Advertisement -

ఇక టీకాలు వేయడమే.. కావలసినన్ని నిల్వలున్నాయి

టీకా వేసే సామర్థానికి కొరత లేదు
3, 4 నెలల్లో ఇతర టీకాలు కూడా వస్తాయి
వాటిని సైతం తగు మోతాదులో నిల్వచేసుకుంటాం
వ్యాక్సినేషన్‌లో వైద్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్యత ఇస్తాం
నిర్ణీత తేదీల్లో బృందాల వారీగా వ్యాక్సినేషన్
కొవిడ్ జాగ్రత్తలతో సామూహిక టీకా కార్యక్రమం
అత్యధిక శాతం ప్రజలకు టీకా వేసినప్పుడే మామూలు పరిస్థితులు నెలకొంటాయి: నీతి ఆయోగ్ సభ్యులు, నెగ్‌వాక్ చైర్మన్ వికె పాల్

Vaccine may be available in India by January

న్యూఢిల్లీ: దేశంలో ప్రాధాన్యతా బృందాలకు అవసరమైన కొవిడ్ టీకా నిల్వలు ఉన్నాయని నీతి ఆయోగ్ సభ్యులు వికె పాల్ సోమవారం తెలిపారు. టీకా నిల్వలు, వ్యాక్సినేషన్ నిర్వహణ సామర్థం దండిగా ఉందన్నారు. కొవి డ్ నియంత్రణ చర్యల ఉధృతిలో భాగంగా ప్రాధాన్యతా బృందాలను గుర్తించారు. వీరికి తొలి దశలో అందుబాటులోకి వచ్చిన కొవిడ్ టీకాలు వేస్తారు. ఈ క్రమంలో మొదటి దశ లో ఆరోగ్య పరిరక్షణ కార్యకర్తలు, క్షేత్రస్థా యి సిబ్బందికి ముందుగా టీకాలు వేసే కా ర్యక్రమం ఉంటుంది. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ కోటా అందుబాటులో ఉందని పాల్ తెలియచేశారు. కొవి డ్ వ్యాక్సిన్ నిర్వహణ విషయాల జాతీయ స్థాయి నిపుణుల బృందానికి (నెగ్‌వాక్) పాల్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌లకు డిసిజిఐ అనుమతిని ఇచ్చి న దశలో టీకా నిల్వల సామర్థం గురించి ప్రశ్నలు తలెత్తాయని పాల్ స్పందించారు.
వ్యాక్సిన్ సేకరణపై ప్రణాళిక
ఇకపై కూడా వ్యాక్సిన్ కొనుగోళ్లు, పంపిణీకి సంబంధించిన తమ కార్యాచరణ ప్రణాళికలను గురించి ప్రభుత్వం వెల్లడిస్తుందని తెలిపారు. వచ్చే మూడు నుంచి నాలుగు నెలల కాలంలో ఇతరత్రా టీకాలు కూడా వస్తాయని, వీటిని కూడా తగు మోతాదులో నిల్వ చేసుకోవడం జరుగుతుందని వివరించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి, డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ తొలి దశకు సంబంధించి అవసరం అయిన టీకా నిల్వలు ఉన్నట్లుగా తాము భావిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ముందు వీరికి వ్యాక్సిన్‌లు వేసిన తరువాత టీకా మందులను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ మరింత వేగవంతం చేస్తామన్నారు. ఇప్పటి స్థాయితో పోలిస్తే అత్యధిక మోతాదులో వ్యాక్సిన్ సేకరించుకుంటామన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ సామూహిక ప్రక్రియ విషయంలో ఉన్న ఏకైక అతి పెద్ద సవాలు ఏమిటనే ప్రశ్నకు పాల్ స్పందించారు. అత్యధిక జనాభా గల దేశానికి భారీ స్థాయి కోటా టీకా అవసరం అని, ఈ క్రమంలో దీని సేకరణకు అంతటి స్థాయి ప్రయత్నాలు అవసరం అన్నారు. ఇదే ఏకైక సవాలు అని తేల్చిచెప్పారు.
ప్రోటోకాల్స్ నడుమ క్రమదశలలో
వ్యాక్సినేషన్‌కు సంబంధించి పలు దశలు ఉంటాయి. నిర్ణీత తేదీని ఎంచుకున్న బృందాలను రప్పించడం, వారికి వ్యాక్సిన్‌లు ఇప్పించే ప్రక్రియను సజావుగా, క్రమపద్ధతితో కూడిన ప్రోటోకాల్స్ నడుమ చేపట్టాల్సి ఉంటుంది. తగు విధంగా కొవిడ్ సంబంధిత జాగ్రత్తలు తీసుకోవాలి. సామూహిక టీకా కార్యక్రమం కావడంతో వైరస్ వ్యాప్తి ముప్పు తలెత్తకుండా చూసుకోవడం కూడా కీలకమే అవుతుంది. అయితే దశలవారిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుంది. దీనిని ఎవరెవ్వరికి ప్రాధాన్యత క్రమాల్లో అందించాల్సి ఉంటుందనేది కూడా ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని పాల్ తెలిపారు.
అంతాకుదుటపడే వరకూ ఆగం
సంపూదేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు మునుపటిలాగానే రావడానికి దేశ జనాభాలో అత్యధిక శాతం ప్రజలకు వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. అప్పుడే పరిశ్రమలు, విద్యాసంస్థలు, రవాణా, న్యాయవ్యవస్థ, చివరికి పార్లమెంటరీ కార్యకలాపాలు కూడా తిరిగి యధాస్థితికి చేరుకుంటాయని తెలిపారు. ప్రతి వ్యక్తిలో కనీసం 70శాతం వరకూ స్వతహసిద్ధమైన రోగనిరోధక శక్తి పుంజుకోవల్సి ఉంటుంది. ఇందుకు వ్యాక్సినేషన్ ఇతరత్రా రోగనిరోధక కల్పన చర్యలు అవసరం అని తెలిపారు. పూర్తి స్థాయిలో కరోనా మహమ్మారి అంతరించి, దీని ప్రభావం తిరిగి తలెత్తకుండా చేసిన తరువాత వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోతుందన్నారు. దేశంలో ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలు చేపట్టడంలో విశేష అనుభవం ఉందని, ఈ క్రమంలో ఇప్పటి టీకా పంపిణీ విషయంలో కూడా ఎటువంటి సమస్య ఉండదని భావిస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ అనేది సామూహిక కార్యక్రమం, ఈ దశలో తీసుకోవల్సిన జాగ్రత్తలు అనేకం ఉంటాయి. దేశవ్యాప్తంగా అతి తక్కువ కాలపు వ్యవధిలోనే జాతీయ ఎన్నికల నిర్వహణ వంటి అనుభవాలు ఉన్నాయని, పెద్ద ఎత్తున వ్యాక్సిన్ నిర్వహణ సంక్లిష్టం ఏమీ కాకపోవచ్చునని తెలిపారు.
వయోజనులకు వ్యాక్సినేషన్ తొలిసారి
దేశంలో యుక్తవయస్కులైన వయోజనులకు వ్యాక్సిన్‌ను అత్యధిక సంఖ్యలో అందించడం ఇదే తొలిసారి అని నీతి ఆయోగ్ సభ్యులు తెలిపారు. ప్రతి దేశానికి ఇటువంటి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని, ఇటువంటి దశలో స్పందించడం అనేది ఆయా దేశాల అంతర్గత సామర్థం మీద అంతకు మించి తగు ప్రణాళికయుత కార్యాచరణతో సాధ్యమవుతుందని తెలిపారు. వ్యాక్సినేషన్ల విషయంలో సరికొత్త అనుభవమే ఎదురవుతోందని, అయితే మనకున్న సాంకేతిక అనుభవం, సార్వత్రిక ఎన్నికల నిర్వహణ వంటి ప్రక్రియల రికార్డుతో ఇప్పటి బృహత్తర కార్యక్రమంలో కూడా విజయం సాధించి తీరుతామని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Corona Vaccine rollout possible soon: Dr VK Paul

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News