Thursday, April 25, 2024

ఏ దేశ వ్యాక్సిన్ అయినా మనకేం పర్వాలేదు

- Advertisement -
- Advertisement -

వైరస్ మ్యుటేషన్లపై దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాపై సిసిఎంబి పరిశోధన
2వేల సార్స్ కొవిడ్2 జినోమ్‌ల విశ్లేషణ
ప్రజలు ఆందోళన చెందాల్సిన పన్లేదు
మరికొన్ని రోజులు జాగ్రత్తలు అవసరం
సిసిఎంబి పరిశోధకురాలు డా. దివ్య

T cells play a vital role in controlling Coronavirus

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నివారణకు ఏ వ్యాక్సిన్ లేదా మందు అయినా మ నకు సత్ఫలితం ఉంటుందని సిసిఎంబి(సెంటర్ ఆఫ్ సె ల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ) పేర్కొంది. ఈ వై రస్ ఎన్నిసార్లు మ్యూటేషన్ చెందిన ఆర్‌ఎన్‌ఏలో మార్పులు సంభవించడం లేదని తెలిపింది. దీంతో ఇతర దేశాల్లో కనిపెట్టినా మందులు లేదా వ్యాక్సిన్లను కూడా మనం వాడేందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని సైంటిస్టులు వెల్లడించారు. వైరస్ మ్యూటేషన్లపై ఇటీవల దేశంలోని
వివిధ ప్రాంతాల నుంచి వైరస్ నమూనాలను సేకరించి సిసిఎంబి పరిశోధన చేసింది. అనంతరం వైరస్ పలు రకాల మ్యూటేషన్లు చెందుతుందనే వార్తలపై స్పష్టతను ఇచ్చింది. ఈసందర్బంగా సైంటిస్ట్ డా దివ్య తేజ్‌సోపతి మాట్లాడుతూ..ఇతర దేశాలతో తయారైన కరోనా మందు లేదా వ్యాక్సిన్ మన దేశంలో పనిచేస్తుందా? అనే అంశంలో వివిధ రకాల శాస్త్రవేత్తల బృందంతో అధ్యయనం చేశామన్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు రెండు వేల సార్స్ కోవిడ్ 2 జీనోమ్‌లను విశ్లేశించామన్నారు. అయితే మన దేశంలో అత్యధిక ప్రాంతాల్లో ఎల్/ఏ3ఐ అనే రూపం ఉందన్నారు. అయితే ఇది ఇప్పటికే నాలుగు సార్లు రూపం మార్చుకుందని, కానీ దాని శాశ్వత రూపం ఆనవాళ్లు భారతీయుల్లో సులువుగా ఉన్నాయని తెలిపారు. ఎన్ని మ్యూటేషన్లు జరిగినా వైరస్ తన స్వభావాన్ని మార్చుకున్నా ఆర్‌ఎన్‌ఏ మారటం లేదని వెల్లడించారు. ఈక్రమంలో భారతీయులకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందకుండా వ్యాక్సిన్, మందులు వచ్చేవరకు మరి కొన్ని రోజులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News