Thursday, March 28, 2024

రష్యా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తి..

- Advertisement -
- Advertisement -

Corona vaccine trials completed in Russia

మాస్కో: కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి సమర్ధవంతమైన, సురక్షిత వ్యాక్సిన్‌ను కనుగొనడానికి ప్రపంచం పరుగులు తీస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను రష్యా పూర్తి చేయగలిగింది. రష్యా లోని సెచెనోవ్ వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ ట్రయల్స్ పూర్తి అయ్యాయని ఆ యూనివర్శిటీ లోని ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్, బయోటెక్నాలజీ డైరెక్టర్ వాడిత్ తారాసోవ్ వెల్లడించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న మొదటి గ్రూపు వాలంటీర్లు బుధవారం డిశ్చార్జి అవుతారని చెప్పారు. రెండో గ్రూపు వాలంటీర్లు ఈ నెల 20న డిశ్చార్జి అవుతారు.

రష్యా లోని గమలీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియోలజీ, మైక్రోబయోలజీ సంస్థ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ జూన్ 18న ప్రారంభమయ్యాయి. వ్యాక్సిన్ భద్రత నిర్ధారించడమైందని, మార్కెట్లో ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ల భద్రతకు అనుగుణంగా ఈ వ్యాక్సిన్ భద్రత ఉంటుందని యూనివర్శిటీ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసిటాలజీ, ట్రాఫికల్, వెక్టర్ బోర్న్ డిసీజెస్ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషెవ్ వివరించారు. వ్యాక్సిన్ భద్రతను నిర్ధారించడమే ప్రస్తుత దశ లక్షమని, అది విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపుతోపాటు తదుపరి అభివృద్ధి ప్రణాళికలను నిర్ణయించారని పేర్కొన్నారు.

Corona vaccine trials completed in Russia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News