Wednesday, April 24, 2024

వ్యాక్సిన్ లేకుండా కరోనా దానంతట అదే పోతుంది: ట్రంప్

- Advertisement -
- Advertisement -

Corona Vaccine Will Release to next month: Trump

వాషింగ్టన్: నెల రోజుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని.. మూడు, నాలుగు వారాల్లోనే లభించవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం భరోసా ఇచ్చారు. వ్యాక్సిన్ అవసరం లేకుండా కరోనా వైరస్ దానంతట అదే పోతుందని కూడా అన్నారు. పెన్‌సిల్వేనియా ఓటర్లతో ప్రశ్నోత్తరాలుసమాధానాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంతకు కొన్ని గంటల ముందు ఒక మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ నాలుగు లేదా ఎనిమిది వారాల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. ఎబిసి టౌన్ హాలులో జరిగిన కార్యక్రమంలో కరోనా మహమ్మారి తీవ్రతను ఎందుకు తక్కువ చేసి చెబుతున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ తాను తక్కువ చేసి చెప్పడం లేదన్నారు.

కానీ జర్నలిస్టు బాబ్ వుడ్‌వర్డ్‌కు ఇచ్చిన ఇంటర్వూలో అమెరికన్ల భయాందోళనలు పోగొట్టడానికి తాను ఉద్దేశ పూర్వకంగా తక్కువ చేయడానికి నిర్ణయించుకున్నానని వెల్లడించిన విషయం రేజ్ పుస్తకంలో ప్రచురణ అయింది కూడా. ఇది వివాదాస్పదం అయింది. ట్రంప్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. హెర్డ్ కమ్యూనిటీ అనడానికి బదులు హెర్డ్ మెంటాలిటీ అని అనడం విస్మయం కలిగిస్తోంది. మీలో హెర్డ్ మెంటాలిటీ అభివృద్ధి చెందితే కరోనా తానంతట తానే పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. మాస్క్ ధరించి పబ్లిక్‌లో అరుదుగా కనిపించే ట్రంప్ అమెరికన్లు మాస్క్ ధరించాలనడం చాలాకాలం వరకు అంగీకరించ లేదు. చాలామంది మాస్క్‌లు ధరించడానికి ఇష్టపడడం లేదని, మాస్క్‌లు ధరించడం మంచిదని అనుకోవడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏ ప్రజలని మీరు అనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు ‘వెయిటర్స్’(సేవకులు) అని సమాధానం ఇచ్చారు.

Corona Vaccine Will Release to next month: Trump

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News