Friday, April 26, 2024

మానవ శరీరంలోనే వైరస్ మార్పులు

- Advertisement -
- Advertisement -

Corona Virus changes in human body itself

భారత శాస్త్రవేత్తల పరిశోధన వెల్లడి

న్యూఢిల్లీ : మానవ శరీరంలో కరోనా వైరస్ ప్రవేశించ గానే తన ప్రతిరూపాలను సృష్టించుకుంటుందని, ఈ క్రమంలో కొత్త వైరస్ ప్రతిరూపాల్లోని న్యూక్లియోటైడ్లలో స్వల్ప మార్పులు తలెత్తుతుంటాయని భారత శాస్త్రవేత్తలు తెలిపారు. అదే వ్యక్తిలో ఈ వైరస్ ప్రతిరూపాలు ఇతర కణాల్లోకి వ్యాపించేకొద్దీ ఆ మార్పులు కూడా క్రమంగా సూక్ష్మజీవిలో పేరుకుపోయే అవకాశం ఉందని చెప్పారు. దీనిద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి సమీపం లోని ఇతరులకూ వ్యాపిస్తున్నాయని వివరించారు. మహమ్మారి సమయంలో రెండు విభిన్న సందర్భాల్లో దాదాపు మూడు వేల మంది కొవిడ్ బాధితుల నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ మేరకు నిర్ధారించ గలిగారు.

ఈ పరిశోధనలో హైదరాబాద్ లోని సిసిఎంబి శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. బాధితుడి శరీరం లోకి కరోనా వైరస్ ప్రవేశించగానే వైరస్ జన్యుక్రమంలో జరిగే మార్పులు, కొత్త వేరియంట్ల లోనూ ప్రతిబింబిస్తున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఉధృతంగా వ్యాపించే కరోనా వైరస్ రకాల విస్తరణ, సాంక్రమిక శక్తిపై ముందస్తు అంచనాలు వేయడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుందని వివరించారు. అలాగే బాధితుడి శరీరంలో ఉన్నప్పుడు వైరస్‌లో జరిగే మార్పులను పరిశీలించడం ద్వారా దాని మనుగడకు కీలకంగా మారే లేదా అవరోధంగా తయారయ్యే భాగాలను గుర్తించడానికి వీలవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News