Thursday, April 25, 2024

తల్లి మావి నుంచి శిశువుకు కరోనా వైరస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గర్భధారణ సమయంలో కరోనా బారిన పడితే ఏమాత్రం ఆలస్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. తల్లి మావి నుంచి శిశువుకి వైరస్ సంక్రమించిన సంఘటన అమెరికాలో ఇటీవలనే జరిగింది. ఇద్దరు తల్లులకు పుట్టిన శిశువుల్లో కరోనా మహమ్మారి కనిపించింది. ఈ విధంగా జరగడం ప్రపంచంలో ఇదే తొలికేసు అని వైద్యులు చెబుతున్నారు. ఈ రెండు శిశువులు బ్రెయిన్ హెమరేజితో జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ మియామీ తన పీడియాటిక్స్ జర్నల్‌లో ఈ వివరాలు వెల్లడించింది. అయితే వ్యాక్సిన్లు అందుబాటు లోకి రాకమునుపు ఈ ఘటన జరిగినట్టు జర్నల్ వివరించింది. ఇద్దరు తల్లులు గర్భధారణ సమయంలోనే కరోనా బారిన పడినట్టు వైద్యులు తెలిపారు. వారిలో ఒకామెకు తేలికపాటి లక్షణాలు కనిపించాయి. మరో ఆమెకు కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యం సంభవించింది.

దీంతో వారికి పుట్టిన శిశువులు ఇద్దరూ జన్మించిన వెంటనే ఫిట్స్ వచ్చాయి. తర్వాత వారిలో సరైన ఎదుగుదల కనిపించలేదు. ఈ శిశువుల్లో ఒక శిశువు 13 వ నెలలో మరణించగా, మరో శిశువు వైద్య పరీక్షలో ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. ఇంతవరకు చిన్న పిల్లలకు కరోనా పరీక్షలు జరగలేదని వైద్యులు చెప్పారు. తొలిసారిగా ఈ శిశువులకు కరోనా వైరస్ జాడలను గుర్తించినట్టు పేర్కొన్నారు. చనిపోయిన శిశువుకు పోస్ట్‌మార్టమ్ నిర్వహించగా, మెదడులో కరోనా వైరస్ జాడలను గుర్తించామని, అందువల్లే మెదడు దెబ్బతిందని మియామీ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. అలాగే కరోనా వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన తల్లికి కేవలం 32 వారాలకే డెలివరీ చేశామని, ఆమె శిశువే వైరస్ తీవ్ర ప్రభావానికి గురై చనిపోయినట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News