Thursday, April 18, 2024

తబ్లిగీతో తల్లకిందులు

- Advertisement -
- Advertisement -

markaj

 

దేశవ్యాప్తంగా ఒక్క రోజే 380 కరోనా కొత్త కేసులు

తమిళనాట 110, ఢిల్లీ 53, ఎపిలో 43 కేసులు మర్కజ్ యాత్రికులవే

1637కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య, 38 మంది మృత్యువాత

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లోను విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం నాటికి ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 1637కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 38 మంది మరణించగా,1466 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మరో 136 మంది కోలుకున్నారు. గత ఇరవై నాలుగు గంటల్లోనే దేశంలో గణనీయంగా పెరిగాయని, దీనికి ప్రధాన కారణం ఢిల్లీలోని తబ్లిగి జమాత్ సమావేశానికి హాజరైన వారిలో ఎక్కువ మంది కరోనా పాజిటివ్‌గా ధ్రువీకరణ కావడమేనని ఆరోగ్య శాఖ సంయుక్త ్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. మొత్తంగా ఒక్క రోజులో 386 కొత్త కేసులు నమోదు కాగా 12 గంటల వ్యవధిలోనే దాదాపు 170 కేసులు నమోదైనా యి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి.

తమిళనాడులో ఒక్క రోజులోనే కొత్తగా 110 కరోనా కేసులు నమోదు కాగా వీరిలో అత్యధికులు ఢిల్లీ సమావేశానికి వెళ్లి వచ్చిన వారే. కాగా మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది. ఇక్కడ కోవిడ్19 బాధితుల సంఖ్య 320కి పెరగ్గా మరణాల సంఖ్య 1౩కు చేరుకుంది. బుధవారం రాష్ట్రంలో 51 ఏళ్ల వ్యక్తి కరోనా కారణంగా మరణించాడు. ఢిల్లీలో కరో నా వైరస్ కేసులు 152కు పెరిగాయి. వీటిలో 53 కేసులు నిజాముద్దీన్ సమావేశానికి హాజరై న వారే ఉన్నారు. మర్కత్ నిజాముద్దీన్ ప్రార్థ నా మందిరంలో ఉన్న దాదాపు 1800 మంది ని వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

కాగా యుపిలో తొలి కరోనా మరణం సంభవించింది. కాగా నిన్న మొన్నటివరకు కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్న ఆంధ్రప్రదేశ్‌లోను కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ రాష్ట్రంలో కేవలం 12 గంటల్లోనే 43 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 87కు చేరుకుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ దేశవ్యాప్తంగా ఇదే ధోరణి ఉందని చెప్పలేమని లవ్ అగర్వాల్ చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. లాక్‌డౌన్ నిబంధనలను మరింత కచ్చితంగా అమలు చేయాలని కోరింది. అలాగే లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించవద్దని, పెద్ద సంఖ్యలో జనం గుమికూడడం, మతపరమైన సమావేశాల్లో పాల్గొనడం లాంటివి చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా లాక్‌డౌన్ కారణంగా దేశంలోని వివిధ మెట్రో నగరాలనుంచి స్వస్థలాలకు పయనమైన వల స కూలీలను ఆదుకోవడానికి రాష్ట్రప్రభుత్వా లు చర్యలు తీసుకుంటున్నాయని విలేఖరుల సమావేశంలో మాట్లాడిన హోం శాఖ సంయు క్త కార్యదర్శి పుణ్యసలిల శ్రీవాస్తవ చెప్పారు.

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైన ముంబై లోని ధారవిలో బుధవారం రాత్రి 65ఏళ్ల వ్యక్తి కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో మురికివాడలోని లక్షలాది మంది ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం వివిధ రాష్ట్రాల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు పరిశీలిస్తే .. ఆంధ్రప్రదేశ్(83), అండమాన్ నికోబార్ దీవులు (10), బీహార్ (23), చండీగఢ్(13), చత్తీస్‌గఢ్(9), ఢిల్లీ (120), గోవా (5), గుజరాత్ (74), హర్యానా (43),హిమాచల్‌ప్రదేశ్(3), జమ్మూ, కశ్మీర్ (55), మధ్యప్రదేశ్ (47), మహారాష్ట్ర(302), మణిపూర్ 1, మిజో రం 1, ఒడిశా 4, పుదుచ్చేరి 1, పంజాబ్ 41, రాజస్థాన్ 93, తమిళనాడు 124, తెలంగాణ 94, ఉత్తరాఖండ్ 7, యుపి 103,పశ్చిమ బెంగాల్ 26 చొప్పున ఉన్నాయి.

 

Corona virus is spreading in India
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News