Wednesday, April 17, 2024

సంపాదకీయం: కరోనా – ఆర్థిక వ్యవస్థలు

- Advertisement -
- Advertisement -

Sampadakiyam కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పుకోవలసిన పని లేదు. ప్రపంచ జనాభాకు ఇది అనుక్షణ చేదు అనుభవంగా మారింది. ముఖ్యంగా ఆసియా, యూరప్ దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలను, పేదలను కరోనా దారుణంగా దెబ్బ తీస్తున్నది. అది సృష్టించిన భయోతాతం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉతత్తి, రవాణా స్తంభించిపోడంతో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు చెప్పనలవికాని మాంద్యానికి గురవుతాయని దాని ప్రభావంతో వృద్ధిరేట్లు పడిపోతాయని ఈ పతనం నుంచి కోలుకోడానికి చాలా కాలం పడుతుందని ప్రపంచ ఆర్థిక సహకారం అభివృద్ధి సంస్థ (ఒఇసిడి) ప్రధాన కార్యదర్శి ఏంజెల్ గురియా చేసిన హెచ్చరికను కొట్టి పారేయలేని స్థితి నెలకొన్నది. ఈ మాంద్యం ప్రపంచమంతటినీ ఆవహించకపోయినా కొన్ని పెద్ద దేశాలు సహా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బ తినడం ఖాయమని అక్కడ ఆర్థిక వృద్ధి అసలే లేకపోవడమో లేదా ప్రతికూల వృద్ధికి గురికావడమో జరుగుతుందని గురియా అన్నారు.

ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2 శాతానికి తక్కువగా ఉండవచ్చని ఒక ట్రిలియన్ డాలర్ల సంపద తుడిచి పెట్టుకుపోవచ్చని ఐక్యరాజ్య సమితి వ్యాపార వ్యవహారాల సంస్థ హెచ్చరించింది. చైనా ఉతత్తి పడిపోతున్నదని దాని వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తినగలదని నిపుణులు చెపుతున్నదానిలో ఆశ్చర్యపోవలసినది లేదు. పాకిస్థాన్ ప్రభుత్వం తన 201920 సంవత్సరపు జిడిపి (స్థూల జాతీయ ఉత్పత్తి) అంచనా రేటును 3.3 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గించుకున్నది. ఇదే పరిస్థితి చాలా దేశాలలో చోటు చేసుకోవడం ఖాయం. లాక్‌డౌన్ వల్ల దేశదేశాల్లో గల నగరాల్లో, పట్టణాల్లో రెస్టారెంట్ల దగ్గరి నుంచి కంపెనీల వరకు మూతపడడంతో సహజంగానే సంపద సృష్టి కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీని వల్ల ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బ తింటున్నాయి. కరోనా వల్ల భారత దేశంలో 348 మిలియన్ డాలర్ల వ్యాపార నష్టం కలుగుతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక తేల్చింది. చైనాలో ఉత్పత్తి పతనం ప్రభావం ప్రపంచ వాణిజ్యం మీద చూపుతుంది. ఈ దెబ్బతినే దేశాల్లో ఇండియా కూడా ఉన్నదని ఆ నివేదిక అభిప్రాయపడింది. కరోనా కారణంగా చైనాలో ఉత్పత్తి దెబ్బ తినడం వల్ల ప్రపంచ ఎగుమతుల విలువ 50 బిలియన్ డాలర్ల మేరకు పడిపోతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక నిర్ధారించింది. అయితే చైనాలో ఉత్పత్తి పతనం వల్ల అత్యధికంగా నష్టపోయే దేశాల జాబితాలో ఇండియా లేదు. ఎక్కువగా యూరప్ దేశాలు 15.6 బిలియన్, డాలర్లు అమెరికా 5.8 బిలియన్ డాలర్లు, జపాన్ 5.2 బిలియన్ డాలర్లు, దక్షిణ కొరియా 3.8 బిలియన్ డాలర్లు, తైవాన్ 2.6 బిలియన్ డాలర్లు, వియత్నాం 2.3 బిలియన్ డాలర్లు నష్టపోతాయి. భారత దేశంలో రసాయనాల పరిశ్రమ 129 మిలియన్ డాలర్ల మేరకు దెబ్బ తింటుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది.

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 25 మిలియన్ ఉద్యోగాలు కోల్పోవడం జరిగిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ వారం రోజుల క్రితం స్పష్టం చేసింది. భారత దేశంలో అసంఘటిత రంగం తీవ్రంగా దెబ్బ తిన్నది. రోజువారీ శ్రమతో బతుకులీడ్చే కూలీనాలీ జనం రోజుల తరబడిన లాక్‌డౌన్ వల్ల పనులు కోల్పోయి నగరాల నుంచి స్వస్థలాలకు తిరుగు వలసలు కడుతున్నారు. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల మీద కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నది. రెస్టారెంట్లలో పని చేసేవారు, చిన్న పెద్ద కంపెనీలలో దిన వేతనాలకు శ్రమ చేసేవారు ఇస్త్రీ వంటి పనులు చేసి బతికేవారు నానా అవస్థలు పడుతున్నారు. దేశంలో గల 90 శాతం కార్మికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారు.

కంపెనీల్లో 87 శాతం సంఘటిత రంగం కార్మిక చట్టాలకు అతీతంగానే ఉన్నాయి. రెస్టారెంట్లు, రవాణా, వినోదం, చలన చిత్ర పరిశ్రమ, విహార యాత్రల రంగం (టూరిజం), రీటైల్ వ్యాపారం వంటివి తీవ్రంగా దెబ్బ తిన్నాయి. స్టాండర్డ్ అండ్ పూర్ సంస్థ 2020 సంవత్సరానికి భారత దేశం వృద్ధిరేటు అంచనాను 5.7 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గించి వేసింది. దేశ వ్యాప్తంగా కఠినమైన లాక్‌డౌన్‌ను ప్రకటించి అమలు చేస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వం దీని వల్ల నష్టపోయే అత్యధిక శాతం దేశ జనాభాను నేరుగా ఆదుకునే సహాయాన్ని ఇంత వరకు ప్రకటించలేదు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం పేదలను కాపాడడానికి ఉచిత బియ్యం, నగదు పంపిణీ వంటి ఆపన్న చర్యలు తీసుకున్నాయి. లాక్‌డౌన్ ఇలాగే కొనసాగితే ప్రపంచ జనాభాలో మెజారిటీగా ఉన్న పేదసాదలు ఆకలితో అలమటించే దుస్థితి తలెత్తుతుంది. ప్రభుత్వాలు ఈ విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించవలసి ఉన్నది.

Coronavirus: A visual guide to the economic impact
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News