Home అంతర్జాతీయ వార్తలు ప్రపంచంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు

Coronavirus

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 12లక్షల దాటింది. ఈ మహమ్మారితో 64వేల 678మంది ప్రాణాలు కోల్పొయారు. 2.46 లక్షల మంది బాధితులు కరోనాతో పోరాడి కోలుకున్నారు. అటు అగ్రరాజ్యం అమెరికాలో రోజురోజుకు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. యుఎస్ లో ఇప్పటివరకు 3.11లక్షల కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులోనే 34,196పైగా కొత్త కేసులు నమోదు కాగా… శనివారం ఒక్కరోజే 1,048 మంది మృతిచెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 8,452 చేరింది. అటు బ్రిటన్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతుంది. నిన్న ఒక్క రోజులోనే అక్కడ 708 మంది చనిపోయారు.

యుకెలో ఒకే రోజు ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారి. మృతుల్లో 5ఏళ్ల బాలుడు ఉండడం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. శనివారం స్పెయిన్‌లో 900 మందికిపైగా చనిపోయారు. కరోనా వైరస్ కేసుల సంఖ్య 126,168, మొత్తం మృతులు 11,947కి చేరింది. జర్మనీలో 96,092లో కేసులు నమోదు కాగా, 1,444 మంది చనిపోయారు. ఫ్రాన్స్‌లోనూ మరణాలు దినదినం పెరుగుతున్నాయి. మొత్తం 7,560 మంది మృతి చెందగా, 89,953 కేసులు నమోదయ్యాయి. ఇరాన్‌లోనూ 3,452 మృత్యువాతపడగా, 55,743 మందికి ఈ వైరస్ సోకింది. బెల్జియంలో 1,283 మంది, స్విట్జర్లాండ్ 666, నెదర్లాండ్ 1,651 మంది ఈ కోవిడ్‌-19 మహమ్మారికి బలయ్యారు.

Coronavirus cases cross 12 lakhs worldwide