Friday, March 29, 2024

కరోనా పంజా పేదలపైనే అధికం

- Advertisement -
- Advertisement -

Coronavirus claw is high on poor families

భారత్‌లో 10 వేల మందికి ఎనిమిది మంది కంటే తక్కువే డాక్టర్లు.  రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం.  లాక్‌డౌన్‌లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో వైఫల్యం. ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడి.

హైదరాబాద్: కరోనా వైరస్ ఎక్కువగా పేదలనే కాటేస్త్తోంది. ప్రపంచవ్యాప్తంగా 66 శాతం పేదలుండగా, వారిని మరింత పేదలుగా మార్చే దుస్థితిని కరోనాతో ఏర్పడిందని ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ తాజా అధ్యయనంలో వెల్లడించింది. ధనవంతులకు సరైన సమయంలో కరోనాకు మెరుగైన వైద్యం అందుతున్నప్పటికీ, అదే పేదలకు వైరస్ లోడ్ ఎక్కువై మాత్రం వైద్యం అందక తనువు చలిస్తున్నారు. ప్రైవేటులో వైద్యం చేసుకునే స్థోమత లేకపోవడమే ఇందు కు కారణం. అదే సమయంలో పనులు లేక, ఒకవేళ పని దొరికినా వచ్చే కూలీ తగ్గిపోతోంది. కరోనా నేపథ్యంలో లాన్సెట్ అంతర్జాతీయ పరిస్థితులను ఇందులో విశ్లేషించింది. దీని ప్రకారం ఇక భారతదేశంలో జనాభాకు సరిపడా డాక్టర్లు లేరని పేర్కొంది.

మన దేశంలో ప్రతీ 10 వేల జనాభాకు ఎనిమిది మంది కంటే తక్కవ మాత్రమే డాక్టర్లు ఉన్నారని తెలిపింది. మన దేశంలో మూడు నెల లు లాక్‌డౌన్ విధించి, సడలింపులు ఇచ్చిన తరువాత కూడా కేసులు మరింతగా పెరుగుతున్నట్లు పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలు అత్యధికంగా కరోనాతో దెబ్బతిన్నాయి. ఆ రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో సైన్యం కూడా పనిచేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. మున్ముందు ఇంకా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని లాన్సెట్ స్పష్టం చేసింది. అయితే లాక్‌డౌన్ సమయంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం, వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను పకడ్బందీగా అమలు చేయడంలో వైఫల్య చెందినట్లు తెలిపింది.

ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించలేదని విమర్శించింది. వైద్యారోగ్య రంగం లో మౌలిక సదుపాయాల కల్పన, పునర్నిర్మాణం జరగలేదు. వైద్య, ఆరోగ్య సిబ్బంది నియామకం జరగలేదని తెలిపింది. ఇప్పటికైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని, మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించకపోతే రాబోయే నెలల్లో తీవ్రత అధికంగా ఉంటుందని అంతం చేసేందుకు కష్టమౌతుందని పేర్కొంది. అమెరికా, బ్రెజిల్‌తో పాటు భారత్‌లో జూన్ 26 నుంచి జూలై 3 వరకు లక్షకన్నా ఎక్కువ కొత్త కేసులు నమోదు కావడాన్ని లాన్సెట్ ప్రస్తావించడం గమనార్హం. అయితే సౌదీ అరేబియా కరోనా కట్టడికి వెంటనే ప్రత్యేక చర్యలు ప్రారంభించి ఆదర్శంగా నిలిచిందని తెలిపింది.

ఆరోగ్య రంగానికి మరింత బడ్జెట్ కేటాయించడంతో పాటు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పడకల సామర్థాన్ని విస్తరించినట్లు వివరించింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగులకు ఉచిత ప్రవేశం కల్పించడానికి వందలాది ఫీవర్ క్లినిక్‌లను ప్రారంభించిందని పేర్కొంది. అదే దేశానికి పొరుగున ఉన్న ఇరాక్, ఎమెన్ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయంది. కరోనా రష్‌యాలో కూడా ఉధృతంగా కొనసాగుతుంది. ఇది మధ్య ఆసియా గుండా మధ్య ప్రాచ్యం, భారత ఉపఖండంలోకి ప్రవేశించేలా ఒక బలమైన గొలుసుకట్టు కరోనా వైరస్ ఏర్పరుచుకుందని లాన్సెట్ విశ్లేషించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News