Friday, April 19, 2024

కరోనా బాధితుడి చుట్టూ గాలిలో పదడుగుల ఎత్తు వరకు వైరస్

- Advertisement -
- Advertisement -

Coronavirus Could Be Detected Up to 10 Ft in Air Around Infected Person

ఐసిఎంఆర్ అధ్యయనం వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాధి సోకిన వ్యక్తి చుట్టూ గాలిలో పది అడుగుల (3.048మీటర్ల) ఎత్తు వరకు గుర్తించ వచ్చని కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సిఎస్‌ఐఆర్) నిర్వహించిన అధ్యయనం పేర్కొనిందని పార్లమెంటుకు ప్రభుత్వం శుక్రవారం తెలియజేసింది. అయితే గాలి వీచే దిశను బట్టి వైరస్ గాలి కణాల్లో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశాన్ని తోసిపుచ్చలేదని లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర శాస్త్ర,సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలియజేశారు. అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా మాస్క్ ధరించడం వల్ల గాలిద్వారా వైరస్ సోకే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చని కూడా ఆ అధ్యయనం పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News