Saturday, September 30, 2023

కరోనా ఎమర్జెన్సీ

- Advertisement -
- Advertisement -

Coronavirus

అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్లూహెచ్‌ఓ
213కు చేరిన మృతుల సంఖ్య
చైనా అత్యవసర చర్యలు
లోహియా ఆస్పత్రిలో అనుమానితులు
బ్రిటన్‌లో రెండు కరోనా కేసులు

బీజింగ్/న్యూఢిల్లీ/లండన్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ అంటువ్యాధి బారిన పడి ఇప్పటికే దేశంలో 213 మంది మరణించారు. భారతదేశంతో సహా ప్రపంచంలో 20 దేశాలకు ఈ వ్యాధి వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్లూహెచ్‌ఓ) అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీని ప్రకటించిందని చైనా ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. కరోనా అంటువ్యాధి వల్ల చనిపోయిన వారిలో ఎక్కువ మంది వయసు మళ్లిన వారే ఉన్నారు. కాగా, మొత్తం 9,692 మందికి ఈ వ్యాధి సోకినట్టు ధ్రువీకరించారు.

చైనాలో తాజాగా మరో 43 మరణాలు నమోదు కావడంతో చనిపోయిన వారి సంఖ్య 213కు చేరిందని, మరో 1,982 మందికి కరోనా వైరస్ సోకిందని చైనా నేషనల్ హెల్త్ అథారిటీస్ (సిఎన్‌హెచ్‌ఎ) తెలిపింది. భారతదేశంతో సహా అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్ వంటి 20 దేశాలు తమ దేశంలో కరోనా వైరస్ కేసులు వెలుగు చూశాయి. చైనా నుంచి పర్యాటకులు రావడంవల్ల ఈ వ్యాధి ఆయా దేశాల్లో వ్యాపించింది. డబ్లూహెచ్‌ఓ ప్రకటనపై చైనా స్పందించింది. ‘కరోనా వైరస్ ఓ కొత్తరకం అంటువ్యాధి. ప్రజారోగ్యంపట్ల బాధ్యతతో వ్యవహరించే ప్రభుత్వం దీని నిరోధానికి, నివారణకు తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. మేంతీసుకుంటున్న చర్యలు అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం అవసరాలను మించి ఉన్నాయి’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువా చునియింగ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

వ్యాధిపై పోరాడే సామర్థం, గెలుస్తామనే నమ్మకం తమకున్నాయని, వ్యాధి నివారణపట్ల చైనా చేస్తున్న ప్రయత్నాలను డబ్లూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియేసస్ ప్రశంసించారని ఆమె చెప్పారు. కరోనా వ్యాధి సోకి ఉండవచ్చని అనుమానిస్తున్న ఆరుగురిని రామ్ మనోహర్ లోహియా(ఆర్‌ఎంఎల్) ఆస్పత్రిలో ఒక ప్రత్యేక వార్డులో వైద్య పర్యవేక్షణలో ఉంచారు. తమ దేశంలో రెండు కరోనా కేసులు వెలుగు చూశాయని, రోగులిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారని, వారిపట్ల ఎంతో శ్రద్ధ తీసుకుని చికిత్స చేయిస్తున్నామని బ్రిటీష్ ప్రభుత్వం వెల్లడించింది.

చైనాలో కరోనాతో హడలెత్తిపోతున్న వూహాన్ పట్టణంలో పౌరుల దయనీయ స్థితికి ఈ చిత్రం అద్దం పడుతోంది. నడిరోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. అసలే కరోనా భయంతో ఇళ్ల నుంచి బయటికి రావడానికే జంకుతున్న స్థానికులు ఆ శవం దగ్గరికి వెళ్లేందుకు సంకోచించారు. అతని మృతికి కారణం తెలియకపోవడంతో కరోనా కావొచ్చని ఆ వైపే వెళ్లలేదు. కొన్ని గంటలు గడిచిన తర్వాత పోలీసులు వచ్చి అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

చైనాకు ఎయిరిండియా విమానం

చైనాలోని వుహాన్‌లో ఉన్న భారతీయుల్ని ఖాళీ చేయించి స్వదేశం తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం శుక్రవారం 423 సీట్లున్న జుంబో బి747 విమానాన్ని పంపింది. ప్రభుత్వం ఇప్పటికే చైనాలో హుబెయి ప్రావిన్స్‌లో ఉంటున్న 600 మంది భారతీయుల్ని సంప్రదించి వారు స్వదేశం రావడానికి ఇష్టపడుతున్నారా, లేదా అని కనుక్కున్నామని అధికారులు తెలిపారు. విమానం బయలుదేరిన తర్వాత ఎయిరిండియా ప్రతినిధి మాట్లాడుతూ ‘ చైనాకు పంపిన విమానంలో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి (ఆర్‌ఎంఎల్) నుంచి ఐదుగురు డాక్టర్లు, ఒక పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. డాక్టర్లు సూచించిన మందులు, మాస్క్‌లు, ఓవర్ కోట్‌లు, ప్యాకెట్‌లలో ఆహారం కూడా పంపించామన్నారు.

Coronavirus declared global health emergency by WHO

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News