Home అంతర్జాతీయ వార్తలు జపాన్ నౌకలో ఇద్దరు భారతీయులకు కరోనా

జపాన్ నౌకలో ఇద్దరు భారతీయులకు కరోనా

Japan ship

 

1,113 కు పెరిగిన మృతులు
టిబెట్‌లో కరోనా రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

బీజింగ్ : జపాన్ సముద్ర తీరానికి దూరంగా ఉన్న ‘డైమండ్ ప్రిన్సెస్’ నౌకలో పనిచేస్తున్న ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్ పరీక్ష చేసినప్పుడు వారికి వ్యాధి సోకినట్టు తెలిసింది. జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం దీన్ని ధ్రువీకరించింది. ఈ నౌకలో 138 మంది భారతీయులున్నారు. ఇలా ఉండగా, చైనాలో కరోనా బారినపడి తాజాగా 97 మంది మరణించడంతో మృతుల సంఖ్య 1,113కు చేరింది. అలాగే, కొత్తగా 2,015 మంది ఈ వ్యాధిగ్రస్థులు కావడంతో, మొత్తం రోగుల సంఖ్య 44,653కు పెరిగిందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. ఇక టిబెట్‌లో కరోనా సోకిన ఒకే ఒక రోగిని 18 రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆ రోగి చైనాలోని వుహాన్ నుంచి జనవరి 22న బయలుదేరి 24న టిబెట్ ప్రాంతీయ రాజధాని లాసాకు రైల్లో వచ్చారు. 25వ తేదీన దగ్గు, జ్వరం రావడంతో అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం అతనికి కరోనా సోకిందని 29న తేలింది.

Coronavirus for two Indians in Japan ship