Home జాతీయ వార్తలు ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం

ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం

coronavirus

 చేతులెత్తి మొక్కుతం కెసిఆర్ సారూ… మమ్మల్ని మా ఊరికి తీసుకపోండి
ముంబైలో చిక్కుకుపోయిన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కూలీలు
తిండి దొరక్క ఇబ్బంది… పట్టించుకోని మహారాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్ : కరోనాతో కా కుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం… ‘చేతులెత్తి మొక్కుతం కెసిఆర్ సారూ.. మమ్మల్ని మా ఊరికి తీసుకపోండి’ అంటూ రెండు జిల్లాల ప్ర జలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దేశంలో కొనసాగుతున్న లాక్‌డౌన్ ప్రతి ఒక్కరిలో ఆందోళన కు కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు కఠినచర్యలు చేపడుతుండడంతో దేశవ్యాప్తంగా జనజీవనం వారం రోజులుగా పూర్తిగా స్థంభించిపోవడంతో వలస జీవు ల పరిస్థితి దుర్భరంగా మారిపోయింది.

సరిగ్గా ఇదే తరహాలో ముంబై నగరంలో తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన పలువురు చిక్కుకు పోయారు. ఈ రెండు జిల్లాలకు చెందిన 20 కుటుంబాలు ముంబైలో తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. పొట్టకూటి కోసం వలస వెళ్లిన ఈ రెండు జిల్లాల వారు లాక్‌డౌన్ కారణంగా అక్కడ పస్తులుంటున్నారు. బయటకు వెళ్లే పరిస్థితులు లేక, పూట గడవక నరకయాతన అనుభవిస్తున్నారు.

ఒక్కో గదిలో 15 మంది

ఒక్కో గదిలో 15 మందికిపైగా కాలం వెల్లదీస్తున్నారు. కరోనా బారిన పడకుండా తమను తాము రక్షించుకుంటూనే స్వగ్రామాలకు తమను చేర్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చేతులెత్తి మొక్కుతున్నారు. కరోనాతో కాకుండా తాము ఆకలితో చచ్చిపోయేలా ఉన్నామని వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ‘చేతులెత్తి మొక్కు తం కెసిఆర్ సారూ.. మమ్మల్ని మా ఊరికి తీసుకపోండి’ అంటూ వీడియోలను మీడియాకు పంపుతున్నారు.

దేశంలో లాక్‌డౌన్ కారణంగా ఎక్కడ ఉన్నా వలస కూలీలు అక్కడే ఉండాలని, వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వసతి, భోజన సౌకర్యం కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా కోరారు. ఆయనతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా విషయంపై అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లే దు. మన రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెంది న వారిని మన ప్రభుత్వం ఆదుకుంటుంటే మహారాష్ట్రలో తెలంగాణ వారు ఇబ్బందులకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల చొరవ మరింతగా పెరగాల్సిన పరిస్థితి ఉందని పలువురు పేర్కొంటున్నారు.

coronavirus in india