Friday, March 29, 2024

86,961 పాజిటివ్ కేసులు …. భారత్@1130 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Coronavirus india condition

 

ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. కరోనా ధాటికి మహానగరాలు గజ గజ వణికిపోతున్నాయి. భారత్ లో ప్రతి రోజు మృత్యుఘంటికలు మోగుతున్నాయి. ప్రతి రోజు దాదాపుగా వెయ్యికి పైగా కరోనా వైరస్ తో చనిపోతున్నారు. గత పది రోజుల నుంచి ప్రతి రోజూ 90 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 86,961 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1130 మంది మృత్యువాతపడ్డారు. భారత్ లో కరోనా వైరస్ 54.87 లక్షల మందికి సోకగా 87,882 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి 43.96 లక్షల మంది కోలుకోగా పది లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 6.43 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశారు. ప్రపంచంలో కరోనా కేసుల విషయంలో భారత్ రెండో స్థానంలో ఉండగా మృతుల సంఖ్యలో మూడో స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News