Friday, April 19, 2024

సెప్టెంబర్‌లో కళ్లెం

- Advertisement -
- Advertisement -

వచ్చే నెలలోనే రాష్ట్రంలో అదుపులోకి కరోనా

ఈ నెలాఖరు వరకు జిహెచ్‌ఎంసిలో నియంత్రణలోకి.. వైరస్ సోకినా రెండు వారాల్లో కోలుకోవచ్చు, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు

జిల్లా స్థాయిలోనూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం

18వేల ఆక్సిజన్ బెడ్లు యుద్ధప్రాతిపదికన సిద్ధం

ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోంది

వైద్య సదుపాయాలకు మరో రూ.100కోట్లు ఇచ్చి  భరోసా నింపింది

ప్రైవేటు ఆసుపత్రులపై 1035 ఫిర్యాదులొచ్చాయ్

లక్షణాలు లేని రోగులు రెమిడిసివిర్ వాడొద్దు, అందరికి ప్లాస్మాథెరపీ అవసరం లేదు

మీడియా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సెప్టెంబర్ చివరి వరకు కరోనా అదుపులోకి వస్తుందని వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా.జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో మాత్రం ఈ నెలాఖరు వరకు కంట్రో ల్ అవుతుందని ఆయన తెలిపారు. ప్రజలంతా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌కు అసలైన మందు ధైర్యమేనని ఆయన అన్నా రు. వైరస్ సోకినా ఎలాంటి టెన్షన్ లే కుండా చికిత్స పొందితే వేగంగా కోలుకుంటారని ఆయన తెలిపారు. కోవిడ్ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈక్రమంలో పేషెంట్లు సకాలంలో మందు లు వాడితే క్రిటికల్ కండిషన్ స్టేజ్‌కు వెళ్లే పరిస్థితి తప్పుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే చికి త్స ప్రోటోకాల్‌పై ప్రతి రోజూ నిపుణులతో సమీక్ష నిర్వహిస్తూ దాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోవిడ్ నివారణకు ప్రభుత్వం అద్బుతమైన చర్యలు తీసుకుంటుం దన్నారు. వైద్యశాఖకు కావాల్సిన సదుపాయాలను వెంటనే సమకూర్చుతున్నారని పేర్కొన్నారు. తాజగా వైద్య సదుపాయాల కోసం మరో రూ.100 కోట్ల ను ఇచ్చారని డిహెచ్ తెలిపారు. వీటితో వైద్యసిబ్బందికి రక్షణ కిట్లు, రెమిడెసివిర్, డెక్సామెథసోన్, ఫావిఫెరవిర్, వంటి మందుల కొనుగోళ్లకు ఎక్కువ శాతం వినియోగిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అన్ని పిహెచ్‌సిలలో ఈ మందులు అందుబాటులో ఉన్నాయని ఆ యన చెప్పారు.

అంతేగా క ప్రతి పిహెచ్‌సిలో ఆక్సిజన్ సిలిండర్లను కూడా సిద్ధం చేశామని, దీంతో రోగి పరిస్థితి క్రిటికల్‌గా ఉంటే వెంటనే ఏరియా ఆసుపత్రి లేదా ఇతర ఆసుపత్రుల వరకు వెళ్లే వరకు ఆక్సిజన్ లెవల్స్ పడిపోకుండా కాపాడవచ్చని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఉన్న వాటితో కలిపి మొత్తం 18 వేల ఆక్సిజన్ పడకలు సిద్ధం చేస్తున్నామని డిహెచ్ తెలిపారు. కోఠి కమాండ్ సెంటర్‌లో శనివారం డిఎంఇ డా రమేష్‌రెడ్డితో కలసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా డిహెచ్ మాట్లాడుతూ…వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు ప్రతి రోజూ సుమారు 23వేల వరకు టెస్టులు చేస్తున్నామన్నారు. వీటిలో గ్రేటర్ జిల్లాల కంటే ఇతర జిల్లాల్లోనే వైరస్ తీవ్రత పెరుగుతోందని పేర్కొన్నారు. కానీ చికిత్స నిమిత్తం అన్ని పిహెచ్‌సిల నంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు సౌకర్యాలను అందుబాటులో ఉంచామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతోనే కేసుల రికవరీ పెరిగిందని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాల కంటే మన దగ్గర మరణాల రేటు చాలా తక్కువగా ఉందని, ప్రభుత్వం సహకారంతో దీన్ని జిరో లెవల్ తీసుకువెళ్లడమే తమ లక్షమని ఆయన వెల్లడించారు. అసింప్టమాటిక్ రోగులకు వెంటనే హోం ఐసోలేషన్ కిట్లను అందిస్తున్నామని, ఇప్పటి వరకు తమ వద్ద 86వేలకు పైగా కిట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆ కిట్‌లో 14 రోజులకు సరిపోయే మందులు ఉంచామన్నారు. ఆసుపత్రుల వికేంద్రీకరణలో భాగంగా ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.

ప్రైవేట్ ఆసుపత్రులపై 1093 ఫిర్యాదులు వచ్చాయి…
ప్రైవేట్ ఆసుపత్రులపై రోజురోజుకి ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుందని డిహెచ్ వెల్లడించారు. ఇప్పటి వరకు 1093 ఫిర్యాదులు రాగా, 130కి పైగా కేవలం అధిక బిల్లులు వసూల్ చేస్తున్నట్లు, 16 ఇన్సూరెన్స్‌లు తీసుకోవడం లేదని ఫిర్యాదులు అందాయని డిహెచ్ తెలిపారు. అయితే వీటిపై పూర్తిస్థాయిలో విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఆసుపత్రులు మూసి వేయడం తమ ఉద్దేశ్యం కాదని ఆయన అన్నారు. ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన ఆసుపత్రులకు మాత్రమే అనుమతులు రద్దు చేస్తున్నామని, ఒకటి రెండు ఫిర్యాదులు వచ్చిన హాస్పిటల్స్‌ను కౌన్సిలింగ్, నోటీసులు ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. డిఎంఇ డా.రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. లక్షణాలు లేని రోగులు రెమిడెసివిర్‌ను వాడోద్దని పేర్కొన్నారు. వాటి అవసరం లేకపోయినా చాలా మంది వేసుకుంటున్నారని, దాని వలన దుష్ప్రభావాలు వాటిల్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ప్లాస్మా చికిత్స అందరికీ అవసరం లేదని ఆయన అన్నారు. కేవలం కొంత మందికి మాత్రమే అది అవసరమవుతుందని ఆయన స్పష్టం చేశారు. వైద్యుల సూచన మేరకు అవి నిర్వహిస్తారని ఆయన తెలిపారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఎక్కడా మందులు, సిబ్బంది, సదుపాయాల కొరత లేదని ఆయన చెప్పుకొచ్చారు. కోవిడ్ సోకితే ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి చికిత్స పొందాలని, అనవసరంగా ప్రైవేట్‌కు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని ఆయన తెలిపారు.

Coronavirus may Control in September: TS Health Officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News