Thursday, March 28, 2024

వర్మ’కరోనా వైరస్’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం ‘క్లైమాక్స్‘ ట్రైలర్ తో హీట్ పుట్టించిన‌ రాంగోపాల్‌ వర్మ ఇప్పడు ‘కరోనా వైరస్’తో దడ పుట్టిస్తున్నాడు. కరోనా వైరస్ తో వర్మ దడపుట్టించడమేంటి అనుకుంటున్నారా?.. అవును, ఈయన కన్ను కరోనా వైరస్ మీద పడింది. ఇకేముంది దానిమీద కూడా ఓ సినిమా తీస్తున్నాడు వర్మ. అగస్త్య మంజు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘కరోనా వైరస్’ అనే సినిమాను వర్మ నిర్మిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను వర్మ ట్వీట్టర్ ద్వారా విడుదల చేశాడు. అయితే, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా ఈ సినిమా షూటింగ్‌ ఎలా చేశారని అనుకుంటున్న ప్రేక్షకులు ఆలోచనకు వర్మ క్లారిటీ ఇచ్చాడు. లాక్‌డౌన్స్‌ నిబంధనలు పాటిస్తూ కరోనావైరస్‌ సినిమాను చిత్రీకరించినట్లు తెలిపాడు. ఇక, ఇది హార్రర్‌ సినిమా కాదని, మనతోపాటు రాజకీయ నాయకులు, అధికారులల్లో అంతర్గతంగా ఉన్న భయానక విషయాలను తెలిపే సినిమా అని, ప్రపంచంలో కరోనా వైరస్ పై తెరకెక్కుతున్న మొట్టమొదటి చిత్రం ఇదేనని వర్మ పేర్కొన్నాడు.

CoronaVirus Movie Trailer released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News