Home జాతీయ వార్తలు భారత్‌లో 271కి చేరిన కరోనా కేసులు

భారత్‌లో 271కి చేరిన కరోనా కేసులు

Coronavirus

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా మారుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 271కి చేరాయి. విదేశాల నుంచి భారత్ కు వచ్చిన వారిలో వ్యాది లక్షణాలు క్రమంగా బయటపడుతున్నాయి. 39 మంది విదేశీయులు కరోనా పాజిటివ్ తేలింది. మహారాష్ట్ర , కేరళ, తెలంగాణ, కర్నాటక, హర్యానాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లలో కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడిచేయడనాకి కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆదివారం నుంచి విదేశాలకు విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. సమూహాల ద్వారా ఎక్కువ మందికి వైరస్ సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో రద్దీ ప్రాంతాలకు వెళ్లవద్దని కేంద్రం సూచించింది.

అటు బాలీవుడ్ షూటింగ్ లపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. మార్చి 31వరకు బాలీవుడ్ షూటింగ్స్ అన్ని బంద్ చేశారు. శనివారం అర్థరాత్రి నుంచి దేశంలో 3500 రైళ్ల సేవలు నిలిచిపోనున్నాయి. రేపు జనతాకర్ఫ్యూ కారణంగా 24గంటల పాటు రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. ఆదివారం ప్రధాన నగరాల్లో మెట్రో రైలు సర్వీసులు కూడా నిలిచిపోనున్నాయి. మహారాష్ట్ర 52, కేరళ 40, తెలంగాణ 19, కర్నాటక 15, ఎపి 3, తమిళనాడు 3, పంజాబ్ 2, ఢిల్లీ 26, జమ్మూకాశ్మీర్ 4, ఒడిశా 2, మధ్యప్రదేశ్ 4, పశ్చిమ బెంగాల్ 3 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 

Coronavirus positive cases reaching 258 in India