Friday, April 26, 2024

డయాబెటిస్ రోగులకు కరోనా ముప్పు

- Advertisement -
- Advertisement -

Corona-Risk

ఇతర అనారోగ్యాలున్నా
జాగ్రత్తలు తప్పనిసరి

న్యూఢిల్లీ: డయాబెటిస్ రోగులకు కరోనా నుంచి 50 శాతం వరకు ప్రాణహాని ఉంటుందని, అం దువల్ల క్రమం తప్పకుండా బ్లడ్‌గ్లూకోజ్‌ను ని యంత్రించుకోవాలని, భౌతికంగా, మానసికం గా ఆరోగ్యం సుస్థిరంగా ఉండేలా ఇంటివద్దనే వ్యాయామం చేస్తుండాలని వైద్య నిపుణులు సూ చిస్తున్నారు. డయాబెటిస్ అనే కాదు, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు తదితర అనారోగ్య పరిస్థితులు ఎవరికైతే ఉంటాయో వారికి కరోనా నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హెచ్చరిస్తోంది.

కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌లో డయాబెటిస్ రోగులు కరోనా నుంచి దాడిని తీవ్రంగా ఎదుర్కోవలసి వస్తుందని, వివిధ రకాల రుగ్మతలను అనుభవించవలసి వస్తుందని, అయితే ఈ సమయంలో వారు తమ జీవ ప్రక్రియను సరిగ్గా నియంత్రించుకోలేకుంటే వారి పరిస్థితి చాలావరకు అధ్వాన్నమౌతుందని ఎండోక్రైనాలజిస్టులు హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవ ప్రక్రియ పేలవంగా ఉండే టైప్1, టైప్ 2 డయాబెటిస్ రోగులకు ఇన్సులిన్ ఒక్కటే ఏకైక వైద్యచికిత్స ప్రక్రియని ఎయిమ్స్ ఎండోక్రైనాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ నిఖిల్ టాండన్ సూచించారు. సాధారణ జాగ్రత్తల సిఫార్సులతోపాటు డాక్టర్ సూచించినట్టు రెగ్యులర్‌గా బ్లడ్ గ్లూకోజ్‌ను పర్యవేక్షించవలసి ఉంటుందని చెప్పారు.

చక్కని ఆర్గీకరణ (హైడ్రేషన్), తగిన మందుల వాడకం తప్పనిసరి అని తెలిపారు. సోమవారం కరోనా మరణాల సంఖ్య 3029కి, కేసుల సం ఖ్య 96169కి చేరాయి. మరణాల్లో 70 శాతం అనుబంధ అనారోగ్య కారణాల వల్లనే జరిగాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. న్యూఢిల్లీ మాక్స్ హెల్త్ కేర్ చైర్మన్, ఎండోక్రైనాలజీడయాబెటాలజీ విభాగం అధినేత డాక్టర్ అంబరీష్ మిథల్ ఆరోగ్య యంత్రాంగంతో కలసి కరోనా రోగుల చికిత్సపై దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి ప్రాథమికంగా రక్షించుకోడానికి జీవ ప్రక్రియ నియంత్రణ (బ్లడ్‌సుగర్, బ్లడ్ ప్రెజర్, లిపిడ్స్) మెరుగ్గా ఉండేలా చూసుకోవాలని సూచించారు.

ఇందు లో లోపాలు కనిపిస్తే జీవ ప్రక్రియ లక్షాలు సాధించుకోడానికి వైద్య చికిత్సను ముమ్మరం చేయాలన్నారు. వీలైతే టెలిమెడిసిన్ ఉపయోగించి రిమోట్ ద్వారా సలహాలు తీసుకోవాలని సూచించారు. బ్లడ్ గ్లూకోజ్ తరచుగా పరీక్షించుకోవాలని, ఆన్‌గోయింగ్ వైద్య సలహాలను ఆప కూడదని, బ్లడ్‌గ్లూకోజ్ ఎక్కువైతే ఇన్సులిన్ వేగంగా ఉపయోగించి నియంత్రించుకోవాలని, మిథల్ చెప్పారు.

ప్రస్తుతం దేశంలో 77 మిలియన్ కన్నా ఎక్కువ మంది డయాబెటిస్ రోగులు ఉన్నారు. దీనిపై గత నెల ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. డయాబెటిస్ రోగులుతోపాటు ఇతర అనారోగ్య లక్షణాలున్న వారు మూడు నెలల పాటు ఆషా లేదా ఎస్‌హెచ్‌సి ద్వారా ప్రిస్క్రిప్షన్‌పై మందులను క్రమం తప్పకుండా వినియోగించాలని, సూచించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News