Tuesday, September 17, 2024

కేరళకు ఏమయింది?

- Advertisement -
- Advertisement -

Coronavirus Situation in Kerala

ఏడాది క్రితం కరోనాను ఎదుర్కోవడంలో దేశానికే ఆదర్శం
ఇప్పుడు నెలల తరబడి కట్టడి కాని మహమ్మారి
ఇప్పటికీ రోజూ సగటున 1215 వేల కేసులు నమోదు
జనం నిబంధనలను గాలికి వదిలేయడమే కారణమంటున్న వైద్య నిపుణులు
పెద్ద ఎత్తున వ్యాక్సినేషనే మార్గమని స్పష్టీకరణ

తిరువనంతపురం: కరోనా తొలి దశలో వైరస్‌ను కట్టడి చేయడంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన కేరళ ఇప్పుడు సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య ను తగ్గించడానికి అహర్నిశలు శ్రమించాల్సి రావడం చూసేవారికి వింతగానే ఉండవచ్చు కానీ ఇది పచ్చి నిజం. ఏడాది క్రితం కరోనా తొలి దశ కట్టడిలో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి రోజూ12 వేలనుంచి 15 వేల మధ్య కేసులు వెలుగు చూసున్నాయి. శనివారం సైతం రాష్ట్రంలో కొత్తగా 14 వేలకు పైగా కేసులు వెలుగు చూడగా 109 మంది వైరస్‌తో పోరాడుతూ మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30.39 లక్షలకు చేరగా, మరణాల సంఖ్య 14,380కి చేరింది. అన్‌లాక్ సమయంలో తీసుకున్న కొన్ని తొందరపాటు చర్యల కారణంగానే కేసుల సంఖ్య పెరిగిందని, త్వరలోనే ఇవి తగ్గుతాయన్న ఆశాభావాన్నిరాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి ఇటీవల వ్యక్తం చేశారు.

ఈ ఏడాది జూన్ 1వ తేదీన కేరళలో దాదాపు 20 వేల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వారం రోజుల పాటు అవి తగ్గుముఖం పడుతూ 7వ తేదీ నాటికి 9313కు చేరాయి. అయితే రెండు రోజుల తర్వాత మళ్లీ 16 వేలను దాటిపోయాయి. గడచిన నెల రోజులుగా రాష్ట్రంలో సగటున ప్రతి రోజూ 11వేలనుంచి 13 వేలదాకా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో తొలి కరోనా కేసు కేరళకు చెందినదే కావడం ఇక్కడ గమనార్హం. 2020 జనవరిలో వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలోని వుహాన్‌నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థికి కరోనా నిర్ధారణ అయింది. వుహాన్‌నుంచి వచ్చిన రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరికి కూడా పాజిటివ్ రాగా ఆ తర్వాత వారంతా కోలుకోవడం జరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News