Home అంతర్జాతీయ వార్తలు 5 నిమిషాల్లో కరోనా పరీక్ష

5 నిమిషాల్లో కరోనా పరీక్ష

Coronavirus

హైదరాబాద్ : అమెరికా కంపెనీ అబొట్ ల్యాబరేటరీస్ గుడ్ న్యూస్ చెప్పింది. జస్ట్ ఐదు నిమిషాల్లో కరోనా వైరస్ టెస్టు జరిపే ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం మన దేశంలో ఏ వ్యక్తిలోనైనా కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకునేందుకు ఒకట్రెండు రోజులు పడు తున్నాయి. అబొట్ కంపెనీ ప్రకారం.. ఐదు నిమిషాల్లోనే శాంపిల్స్‌ని టెస్ట్ చేసి.. కరోనా వైరస్ సోకిందో లేదో నిర్ధారించవచ్చు. ఏప్రిల్ 1 నుంచి రోజుకు 50000 కరోనా నిర్ధారిత టెస్టులు కంపెనీ నిర్వహిస్తోంది.

శాంపిల్‌లో కరోనా వైరస్ జన్యువులు ఉన్నాయా? లేదో తమ పరికరం ఐదు నిమిషాల్లో చెప్పేస్తుందని వివరించింది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఐదు నిమిషాల్లో కరోనా వైరస్ టెస్టు జరిపే ప్రక్రియను భారతదేశంలో ప్రారంభించే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలో దేశంలో కరోనా ప్రభావిత రాష్ట్రాలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రయత్నాలు ప్రారంభిం చినట్లు సమాచారం.

coronavirus test in 5 minutes