Home తాజా వార్తలు భారత్ చర్యకు ఐఎంఎఫ్ మద్దతు

భారత్ చర్యకు ఐఎంఎఫ్ మద్దతు

IMF

 

కార్పొరేట్ పన్ను తగ్గింపు పెట్టుబడులను ఆకర్షించే చర్యగా అభివర్ణన

వాషింగ్టన్: ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఇటీవల భారత ప్రభుత్వం తీసుకున్న కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి( ఐఎంఎఫ్) స్వాగతించింది. ఇది పెట్టుబడులను ఆకర్షించే సానుకూల చర్యగా ఐఎంఎఫ్ ఆసియాపసిఫిక్ విభాగం డైరెక్టర్ చాంగ్‌యోగ్ రీ అభివర్ణించారు. అయినా నిరంతర ఆర్థిక భద్రత, స్థిరత్వం కోసం భారత్ ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన పునర్వవస్థీకరణ లాంటి చర్యలు వృద్ధికి దోహదం చేస్తాయన్నారు. అలాగే బ్యాంకింగేతర సంస్థల్లో సమస్యలను ఇంకా పరిష్కరించాలిస ఉందన్నారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని తెలిపారు.

భారత్ లాంటి దేశాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు అనేక సవాళ్లు ఎదురవుతాయని చాంగ్‌యోడ్ రీ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సహకరించేందుకు ఐఎంఎఫ్ ఆయా దేశాల్లో ప్రాంతీయ సంస్థల్ని నెలకొల్పిందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే. వృద్ధి 7.3 శాతం ఉంటుందని గత ఏప్రిల్‌లో అంచనా వేయగా దానిలో 1.2 శాతం కోత విధించి 6.1 శాతానికి పరిమితం చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. అయితే 2020లో వృద్ధి పుంజుకొని 7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తాజాగా విడుదల చేసిన అంచనాల్లో పేర్కొంది. ఇటీవల ప్రపంచ బ్యాంక్ కూడా భారత వృద్ధి అంచనాలను 6 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.

Corporate income tax cut to help revive investment in India