Home తాజా వార్తలు గాంధీ హాస్పిటల్ కల తీరింది..

గాంధీ హాస్పిటల్ కల తీరింది..

Gandhi-Hospitalహైదరాబాద్: నిరుపేదల పాలిట సంజీవనిలా ఉన్న ప్రభుత్వ గాంధీ వైద్యశాల కల తీరింది. ఆసుపత్రికి వస్తున్న పేదల రోగులకు అత్యాధునికి వైద్య పరికరాలతో కార్పొరేట్ స్ధాయి వైద్యాన్ని అందించాలన్నది వైద్యుల చిలకాల కోరిక. నిన్న మొన్నటి వరకు తమ కోరిక తీరదేమోనన్న నిరాశ నిసృహాలతో గాంధీ వైద్యులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి కేంద్రంగా పని చేస్తున్న మింట్ ఇండియా కార్పొరేషన్ సంస్ధ దృష్టి గాంధీ హాస్పటల్‌పై పడింది. నిత్యం వేలాదిగా నిరుపేదలు, అభాగ్యులు వచ్చి మెరుగైన వైద్యం చేయించుకున్న విషయం మింట్‌ను ఆకర్షించింది.

అయితే ఆసుపత్రిలో అందుకు తగిన విధంగా వైద్య పరికరాలు లేవ్వన్న విషయాన్ని ఆ ఆసుపత్రి ఐసీయు హెచ్‌ఓడి డా. రాజారావు ద్వారా తెలుసుకున్నారు. ఇదే విషయమై మింట్ యాజమాన్యం సానుకూలంగా స్పందించిన సంగతిని ఆర్‌ఓఓ డా. శేషాద్రి నాయుడు దృష్టికి డా. రాజారావు తీసుకువచ్చారు. దీంతో ఆర్‌ఎంఓ చొరవ తీసుకుని ఆసుపత్రి పక్షాన మింట్ యాజమాన్య ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఫలితంగా గాంధీ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యనిపుణుల చిరకాల స్వప్నమైన ఆధునాత వైద్య పరీక్షలు కళ్ల ముందుకు వచ్చాయి. ఈ తరహా వైద్య పరికరాలు ప్రభుత్వ ఆసుపత్రికి అందుబాటులోకి రావడం ఇదే ప్రప్రధమం కావడం గమనార్హం.

రోగులకు శుభవార్త..

గాంధీ ఆసుపత్రి రోగులకు నిజంగా శుభవార్తే మరి. ఇక నుంచి రోగులకు శస్త్రచికిత్సల్లో ఎలాంటి జాప్యం లేకుండా కార్పొరేట్ స్ధాయిలో ఆధునాతన వైద్య యంత్రాలు గాంధీకి సమకూరాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ శ్రావణ్ కుమాఱ తెలిపారు. చర్లపల్లిలోని మింట్ కాంపౌండ్ ఇండియా గాంధీ ఆస్పత్రికి రెండు వాక్ థెరపీ యంత్రాలను, ఎండో వీనస్స్ లేజర్ మిషన్, 2డి ఎకో మిషన్, రెండు పూర్తి స్ధాయి ల్యాప్రోస్కోపిక్ మిషన్లు, హై ఫ్రీక్వెన్సీ ఇంపెడెన్స్ మ్యానోమాట్రీ మిషన్, జీసెస్ ఆపరేటింగ్ మైక్రోస్కోపీ, ఆపరేటింగ్ హైస్ట్రోస్కోపీ యంత్రాలను వితరణ చేసింది.

దాదాపు కోటి రూపాయలకు పైగా విలువ కలిగిన ఈ అధునాతన యంత్ర పరికరాలను శనివారం మింట్ ఇండియా చర్లపల్లి విభాగం జనరల్ మేనేజరు వి.రాములు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రావణ్ కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా డా. శ్రావణ్ మాట్లాడుతూ.. ఆర్‌ఎంఓ శేషాద్రి నాయుడు చొరవతో మింట్ ఇండియా ప్రతినిధులు ఆస్పత్రికి ఎలాంటి వైద్య పరికరాలు కావాలని కోరారని. అప్పుడు జనరల్ సర్జన్,గ్యాస్ట్రో, ప్లాస్టిక్ సర్జరీ, గైనిక్ విభాగాలకు అవసరమయ్యే ముఖ్యమైన యంత్రాలు కావాలని కోరామని చెప్పారు.

అందుకు మింట్ కాంపౌండ్ జీఎం రాములు ఆమోదం తెల్పడమే కాదు.. కేవలం మూడు వారాల్లో ఆసుపత్రిలో పేద రోగులకు కార్పొరేట్ వైద్యం అందించడానికి దోహదపడ్డారని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కడ లేని విధంగా గాంధీ ఆసుపత్రి అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చకుందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కార్పొరేట్ స్ధాయిలో ఖరీదైన వైద్య యంత్రాలు గాంధీకి వచ్చాయని చెప్పాలన్నారు. వీటి ద్వారా ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా శస్త్ర చికిత్సలు చేస్తామని చెప్పారు.

ఆధునిక వైద్య యంత్రాలు..ఉపయోగాలు

2డి ఎకో యంత్రం..గాంధీ ఆస్పత్రిలోని 65 పడకల ఐసీయూలో ఏర్పాటు చేసిన 2డిఎకో వైద్య యంత్రంతో అత్యవసర వైద్య సేవలను మరింత మెరుగుగా అందించడానికి అవకాశం కలుగుతుంది. అంతే కాకుండా గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చిన రోగులకు సకాలంలో అత్యాధునికి వైద్యం అందించవచ్చు. ఈ పరీక్షకు బయట ఆసుపత్రుల్లో రోగికి రూ. 15,౦౦౦లు చొప్పున వసూలు చేస్తున్న పరిస్థితి.

మ్యానిమేట్రీ యంత్రం..

గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో ఎంతో ఉపయుక్తంగా ఈ అత్యాధునిక వైద్య యంత్రం. హై ఫ్రీక్వెన్సీ ఇంపెండెన్స్ మ్యానిమేట్రీ యంత్రం ముఖ్యంగా మోషన్ అవక బాధపడేవారికి మెరుగైన చికిత్స పొందడానికి ఈ యంత్రం దోహదపడుతుంది. ఇప్పటికే ఆస్పత్రికి వచ్చిన రోగుల్లో 15 మందికి మ్యానిమేట్రీ పరీక్షలు నిర్వహించారు.

వాక్ థెరపీ యంత్రం..

ఈ వైద్య పరికరం ఎముకలు, సాధారణ వ్యాధులు, ప్లాస్టిక్ సర్జరీ, మధుమేహం వ్యాధులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ పరీక్షకు రోగి నుంచి రూ. 20,000ల నుంచి రూ. 30,000ల వరకు వసూలు చేస్తున్నారు. అలాంటి గాంధీలో ఉచితంగా వైద్యపరీక్ష నిర్వహించి మెరుగైన చికిత్స అందించనున్నారు.

ఎండో వీనస్స్ లేజర్ మిషన్..

జనరల సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాలకు ఉపయోగపడే ఈ మిషన్ ద్వారా అతి తక్కువ రోజుల్లో కార్పొరేట్ స్ధాయి వైద్యం పొంది తిరిగి ఇంటికి చేరుకోవచ్చు. వాస్తవానికి ఈ పరీక్షకు రూ. 50..60వేల వరకు వసూలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు.

మాన్నిక్యూన్ మిషన్..

వైద్యులు తమ వృతి నైపుణ్యాన్ని మరింత పెంచుకోవడానికి దోహదపడుతుంది. అకడమిక్ ప్రయోజనాలకు ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య విద్య సంబంధించిందనే చెప్పాలి. వాస్తవానికి ఈ మిషన్‌పై వైద్యులు శిక్షణ పొందాలంటే బయట రూ. 10,000లు చొప్పున వసూలు చేస్తున్న పరిస్థితి. అలాంటి గాంధీ వైద్య కళాశాలలో వైద్యవిద్యనభ్యసిస్తున్న మెడికల్ విద్యార్ధులకు ఉచితంగానే తమ స్కిల్స్‌ను పెంచుకునేందుకు అవకాశం ఏర్పడింది.

ల్యాప్రోస్కోపీ..

గ్రైనకాలజీ, జనరల్ సర్జరీ డిపార్టుమెంట్‌లకు సంబంధించిన ఈ యంత్రంపై అబ్డామిన్ పరీక్షలు నిర్వహిస్తారు. అంతే కాకుండా పాల్విక్ సర్జరీలకు కూడా దోహదపడుతుంది. దీని కారణంగా ఎమర్జన్సీ రోగులు కేవలం 5 రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ కావచ్చు. ల్యాప్రోస్కోపీ పరీక్షకు బయట రూ. 60 నుంచి 80వేల వరకు వసూలు చేస్తున్న పరిస్థితి.

ఆపరేటింగ్ హైస్ట్రోస్కోపీ…

స్త్రీ సమస్యలు, ప్రసూతి సంబంధ పరీక్షలకు దోహపడే ఈ హైస్ట్రోస్కోపీ యంత్రం మరింత మెరుగైన సేవలను అందించడవచ్చంటున్నారు గాంధీ గ్రైనకాలజీ డిపార్టుమెంట్ హెచ్‌ఓడీ డా. మహాలక్ష్మి. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా ఈ యంత్రం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి అందుకు అనుగుణంగా చికిత్స అందిస్తే వారం రోజులో రోగి డిశ్చార్జ్ అవుతుందన్నారు. ఈ పరీక్షకు బయట రూ. 30 నుంచి 40 వేల వరకు వసూలు చేస్తున్న పరిస్థితి అని చెప్పారు.

జీస్ ఆపరేటింగ్ మైక్రోస్కోపీ..

చెవి,ముక్కు, గొంతు సమస్యలకు సంబంధించి అత్యాధునిక వైద్యాన్ని సకాలంలో అందించడానికి ఈ యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పరీక్ష కోసం బయట ఆసుపత్రుల్లో రోగి నుంచి రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నారు. అలాంటి పరీక్షను గాంధీ వైద్యులు ఉచితంగా నిర్వహిస్తూ కార్పొరేట్ స్ధాయి వైద్యాన్ని అందించేందుకు సంసిద్ధమయ్యారు.

Corporate Treatment in Gandhi Hospital