Home తాజా వార్తలు కార్పొరేషన్ బ్యాంక్ లాభం 27 శాతం జంప్

కార్పొరేషన్ బ్యాంక్ లాభం 27 శాతం జంప్

Corporation-Bank

మన తెలంగాణ/ హైదరాబాద్ : మొండి బకాయిలు తగ్గడం వల్ల సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో కార్పొరేషన్ బ్యాంక్ అద్భుతంగా రాణించింది. వార్షిక ప్రాతిపదికన బ్యాంక్ లాభం 27 శాతం పెరిగి రూ.130 కోట్లకు చేరుకుంది. 2018 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.103 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం గతేడాదిలో రూ.4,217 కోట్ల నుంచి రూ.4,713 కోట్లకు పెరిగిందని బ్యాంక్ వెల్లడించింది. అలాగే వార్షిక ప్రాతిపదికన బ్యాంకు నికర వడ్డీ ఆదాయం రెండో త్రైమాసికంలో 8.5 శాతం క్షీణించి 1334.4 కోట్ల రూపాయలకు చేరుకుంది.

అయితే ఇది గతేడాదిలో 1457.6 కోట్ల రూపాయలుగా ఉంది. త్రైమాసికంత్రైమాసికం ఆధారంగా, బ్యాంక్ స్థూల ఎన్‌పిఎ రెండో త్రైమాసికంలో 15.43 శాతంగా ఉంది. అంతకుముందు త్రైమాసికంలో 15.44 శాతంగా ఉంది. గత త్రైమాసికంలో 5.69 శాతంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో బ్యాంకు నికర ఎన్‌పిఎ 5.59 శాతంగా ఉంది. త్రైమాసికంత్రైమాసికం ఆధారంగా, బ్యాంక్ కేటాయింపు 789.5 కోట్ల రూపాయలుగా ఉండగా, అంతకుముందు త్రైమాసికంలో 729.5 కోట్ల రూపాయలుగా ఉంది. 2018లో బ్యాంకు కేటాయింపు రూ.808.3 కోట్లు.

Corporation Bank at Rs 130 crore shows