Friday, March 29, 2024

మినీ ‘పుర’ పోలింగ్ ప్రారంభం….

- Advertisement -
- Advertisement -

AP High Court permission for Parishad Elections

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లతో పాటు నకిరేకల్, కొత్తూర్, జడ్చర్ల, అచ్చంపేట, సిద్దిపేట మున్సిపాలిటీలకు శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా విజృంభణ దృష్ట్యా కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా నియంత్రణలో భాగంగా సిబ్బంది ఫేస్ షీల్డులు, మాస్కులు, శానిటైజర్లు ఉపయోగిస్తున్నారు.  వరంగల్‌లో మొత్తం 66 డివిజన్లలో 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగర పరిధిలో 6 లక్షల 53 వేల 240 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 5 వేల 125 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. 3 వేల 7 వందల మందికిపైగా పోలీసు సిబ్బంది ఎన్నికల విధులకు హాజరవుతున్నారు. 46 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ క్యాస్టింగ్ చేస్తుండగా 561 కేంద్రాల్లో సిసిటివిల ద్వారా ప్రక్రియను రికార్డ్ చేస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా 3 వేల 700 పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 167 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామని పోలీస్ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News