Home మహబూబ్‌నగర్ పాలమూరు మున్సిపాల్టీకి కార్పొరేషన్ హోదా?

పాలమూరు మున్సిపాల్టీకి కార్పొరేషన్ హోదా?

Corporation status to the Palmuram municipality

మరో 9లోకల్ బాడీల ఏర్పాటుకు ప్రతిపాదనలు
కార్పొరేషన్ ఏర్పాటు అయితే మారనున్న రూపు రేఖలు
రియల్ భూం పెరిగే అవకాశాలు
అన్ని వర్గాలకు తప్పని పన్నుల మోత
పెరగనున్న ఆర్థిక పరిపుష్టి

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : పుర పాలన సౌలభ్యం కోసం మున్సిపాల్టీలను కార్పొరేషన్‌లు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కార్పొరేషన్ హోదా ఎట్టకేలకు పాలమూరుకు వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రా ష్ట్రంలో కొత్తగా 71 మున్సిపాల్టీలతో పాటు సిద్దిపేట, పాలమూరు మున్సిపాల్టీలను కార్పొరేషన్  చేసే విధంగా మున్సిపల్ పరిపాలనా అధికారు లు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రోజు రోజు కు విస్తరిస్తున్న పెరుగుతున్న జనాభాతో పాటు విస్తరిస్తున్న పట్టణ జనాభాను దృష్టిలో ఉంచుకొని  మున్సిపాల్టీ స్పెషల్ గ్రేడ్ నుంచి కార్పొరేషన్ స్థాయికి హోదా కల్పిస్తూ త్వరలో ప్రభుత్వ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు కూడా ప్రభు త్వం తెప్పించుకున్నట్లు సమాచారం.

రాష్ట్ర గవర్నర్‌తో నోటిఫికేషన్ విడుదల చేయించి మహబూబ్‌నగర్ మున్సిపాల్టీని కార్పోరేషన్‌గా మార్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ గ్రేటర్‌తో పాటు వరంగల్,నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, రామగుండం కార్పోరేషన్లు ఉన్నాయి. వీటికి తోడు మరో రెండింటిని కార్పోరేషన్‌లుగా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో పాలమూరు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్టంలో మహబూబ్‌నగర్ జిల్లా పెద్ద జిల్లా అయినప్పటికీ, మహబూబ్‌నగర్ పట్టణం కూడా చాలీ చారిత్రాక్మమైనది గా గుర్తింపు ఉంది. అ నేక సంవత్సరాలుగా మహబూబ్‌నగర్ పట్టణం ఎలాంటి అభివృద్దికి నోచుకోలేదు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ చొరవతో ఇటీవలనే అభివృద్ది వైపు పరుగులు పెడుతోంది. ఇప్పటికే మయారి నర్సరి, ట్యాంక్ బండ్, రోడ్ల విస్తరణ, ఐటి కారిడార్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, వంటి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలతో పాలమూరు పట్టణం దినదినంగా పరుగులు పెడుతోంది. అయితే మరింత పాలమూరు పట్టనం అభివృద్ది చెందాలన్న, కేంద్రం నుంచి నిధులు రావాలన్నా కార్పోరేషన్ హోదా ఉంటే తప్ప వచ్చే పరిస్థితులు లేవు.

ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ పట్టణాన్ని కార్పోరేషన్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసుకుంటోంది. కార్పొరేషన్ హోదా కావాలంటూ జనాభా రెండున్నర లక్షలు జనాభ ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఓటర్లే కనీసం లక్షన్నర దాక ఆ ఉండవచ్చునని భావిస్తున్నారు. పట్టణం చుట్టూ ఉన్నకొన్ని గ్రామ పంచాయితీలను వార్డులుగా మార్చి కార్పోరేషన్ హోదా కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. బహుశ రెండు మూడు రోజుల్లో జిఒ విడుదల కానుందని భావిస్తున్నారు. కార్పోరేషన్ హొదా పెరిగితే పట్మట్టణంలో రోడ్ల విస్తరణతో పాటు ప్రజలు మౌళిక సదుపాయలు మంచినీరు, డ్రైనేజి వీధిలైట్లు,పార్కులు,వంటి అభివృద్ది చెందుతాయి. అదే విధంగా కార్పోరేషన్‌కు ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయి.

ఊపందుకోనున్న రియల్ భూం
మహబూబ్‌నగర్ పట్టణం కార్పొరేషన్‌గా ఎదిగితే పట్టణం చుట్టూ రియల్ భూం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పట్టణం శివారులో మయూరి నర్సరి, నూతన కలెక్టరేట్, దివిటి పల్లె వద్ద ఐటి కారిడార్, మెడికల్ కళాశాల వంటివి ఏర్పాటు కావడంతో ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల భూములకు రెక్కలు వచ్చాయి. దీంతో రియల్ భూం పెరిగే అవకాశాలు ఉన్నాయి.చిన్న మద్య తరగతి రైతుల భూముల ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐటి కారిడార్ వస్తే జడ్చర్ల, మహబూబ్‌నగర్ మద్యన ఉన్న భూములకు ధరలు రెక్కలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

పన్నుల మోత
కార్పొరేషన్ హోదా పెరిగితే చిన్న మద్య తరగతి ప్రజలతో పాటు ఇతరులకు కూడా పన్నుల మోత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటి పన్నుతో పాటు, నీటి పన్ను, ఆస్తిపన్ను, ఖాళీ స్థలాలపై పన్ను వంటివి భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. విలీనమైన గ్రామాలలో కూడా పన్నులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాణిజ్య పన్నులు కూ డా పెరిగే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే పన్నుల వసూళ్లో ముందంజలో ఉన్న మహబూబ్‌నగరఖ మున్సిపాల్టీ ఆదాయ వనురులను బట్టి కార్పోరేషన్ హోదాను సాధించే దిశగా రూపు దాల్చనుంది. భారీ ఎత్తున పన్నులు చెల్లించాల్సిఉన్నప్పిటికి ఆదే స్థాయిలో పట్టణ ప్రజలకు మౌళిక సదుపాయలు కల్పించాల్సిన అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు,డ్రైనేజి,మెరుగయ్యు అవకాశాలు ఉన్నాయి.
* కొత్త ప్రతిపాదనలు
ఔటర్ రింగ్ రోడ్ లోపల అర్బన్ లోకల్ బాడీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా మొత్తం 25 అర్బన్ లోకల్ బాదీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఇందులో మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో కొత్త లోకల్ బాడీలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో మఖ్తల్, భూత్‌పూర్, కోస్గి, జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్, వడ్డేపల్లి, వనపర్తి జిల్లాలో కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్ అమర చింతలు ఉన్నాయి. నూతనంగా స్థానిక సంస్ధలు ఏర్పాటు అయితే ఆయా ప్రాంతాలు కొత్తపాలనతో అభివృద్ది దిశగా పయనించే అవకాశాలు ఉన్నాయి.