Saturday, April 20, 2024

విపక్షం ‘ఈ’ఢీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ/హైదరాబాద్: అదానీ గ్రూప్‌పై అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నందున వీటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వెంటనే దర్యాప్తును చేపట్టాలని పలు ప్రతిపక్షాల నేతలు బుధవారం ఓ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. పలు అవినీతి వ్యవహారాలు జరిగినట్లు, బోగస్, షెల్ కంపెనీల ద్వారా ఆర్థిక అక్రమ లావాదేవీలు జరిగినట్లు బలీయంగా ఆ రోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనీలాండరింగ్ వ్యవహారాలపై విచారణకు దిగే ఇడి పరిధిలోకి వస్తాయి. ఈ క్రమంలో ఇడి దీనిపై విచారణకు దిగాల్సిందే. ఇడి ఇది తన పరిధిలోకి రాదని బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి వీల్లేదని 16 ప్రతిపక్ష పార్టీల నేతలు సంయుక్తంగా ఇడి డైరెక్టర్ ఎస్‌కె మిశ్రాకు ఇమొ యిల్ ద్వారా లేఖ పంపించాయి. ఈ లేఖపై కాంగ్రెస్, బిఆర్‌ఎస్, సిపిఐ, సిపిఎం, జెడి యు, శివసేన (ఉద్ధవ్), ఆర్జేడీ, డిఎంకె, జెఎంఎం, ఆప్, ఐయుఎంఎల్, విసికె, కేరళ కాంగ్రెస్, పార్టీల నేత లు సంతకాలు చేశారు. అదానీ వ్యవహారంపై ఇడికి ప్రత్యక్షంగా ఫిర్యాదు చేసేందుకు ప లువురు ప్రతిపక్ష పార్టీల నేతలు బుధవారం ప్రదర్శనగా వెళ్లగా విజయ్‌చౌక్ వద్ద వారిని పోలీసులు అ డ్డుకున్నారు.

దీంతో వారు ఇప్పుడు తమ ఫిర్యాదు ను, ఇడి విచారణకు డిమాండ్‌ను ఈ లేఖ ద్వారా పంపించారు. లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. ‘ఇటీవలి కాలంలో ఇడి చేపడుతున్న పలు సోదాలు, దాడులు పూర్తిగా ఈర్షాపూరితంగా, రాజకీయ పక్షపాతంతో ఏకపక్షంగా ఉంటున్నాయనే విషయం పూర్తి స్థాయిలో మాకు తెలుసు. ఇడితో పాటు సెబీ, సిబిఐ సోదాలు, దాడులను కూడా ఏకకాలంలో నిర్వహించడం , ఒకరి వేదికను మరొకరు పంచుకోవడం వంటివి అనేకం జరుగుతున్నాయి. ఈ దశలో అదానీ వ్యవహారంపై ఏర్పాటు అయిన సుప్రీంకోర్టు నియమిత కమిటీ లేదా కమిషన్ విచారణ పరిధి చాలా పరిమితంగా ఉంటుందనేది తెలిసిందే. ఈ స్థితిలో అదానీ అవినీతి వ్యవహారాలపై వచ్చిన ఆరోపణల నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఇడి ముందుకు రావల్సిందే. సుప్రీంకోర్టు కమిటీ ఉందని కానీ ఇతరత్రా సాకులు చెప్పడం ద్వారా కానీ ఇడి తన బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూడరాదు. ఈ విధంగా చేస్తే అది విద్యుక్త ధర్మానికి దూరంగా వెళ్లడమే అవుతుంది’ అని విపక్ష నేతలు ఈ లేఖాస్త్రాన్ని సంధించారు.

వెంటనే ఇడి సంచాలకులు స్పందించి తాము అదానీపై లేవనెత్తిన పలు ఆరోపణల గురించి విచారించి తగు చర్యను వెంటనే తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. గత మూడు నెలలుగా అదానీకి వ్యతిరేకంగా పలు కీలకమైన సాక్షాధారాలు లభించాయని , ఇది చివరికి ప్రజా మాధ్యమాల ద్వారా జగద్విదితం అయ్యాయని, లోకం కోడై కూస్తున్న వాటిపై ఇడి పరిధిలోకి నిర్థిష్టంగా రావల్సిన వాటిపై విచారణ జరిగితీరాల్సిందే అని తెలిపారు. తప్పుడు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ధైర్యంగా, నిజాయితీతో వేగవంతంగా విచారణలు ఉంటాయని చెప్పే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ , ఓ వైపు ఇతర విషయాలలో ప్రాధమిక విషయాలనే పరిగణనలోకి తీసుకుని పూర్తిస్థాయిలో వేట సాగిస్తూ ఉంటే , మరి ఇప్పుడు దేశ ఆర్థిక స్థితిని మరింతగా ప్రభావితం చేసే విషయాలపై, అభియోగాలపై కనీసం ప్రాధమిక దర్యాప్తును కూడా చేపట్టలేదనే విషయం తెలుసుకోవాలని కోరారు.

ప్రస్తుత పరిస్థితితో తాము ఇడి వర్గాలకు ఈ అధికారిక ఫిర్యాదును వెలువరించాల్సి వస్తోందని విపక్ష నేతలు తెలిపారు. కేవలం మన ఆర్థిక వ్యవస్థకే కాకుండా, ప్రత్యేకించి ముఖ్యంగా మనకు మన ప్రజాస్వామ్యానికి తీవ్రస్థాయి పరిణామాలు తెచ్చిపెట్టే అంశాలపై , ఇందులో ఇమిడి ఉండే సంబంధ బాంధవ్యాలపై దర్యాప్తు చేపట్టాల్సి ఉందని తెలిపారు. లేఖలోని అంశాల వివరాలను కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. 16 పార్టీలకు చెందిన ఎంపీలు,నేతలు అదానీ స్కామ్‌పై దర్యాప్తునకు ఇడికి విజ్ఞప్తిని అందించాలని వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారని వెల్లడించారు.

పలు ప్రకంపనల విషయం
చిన్న విషమేమీ కాదు కుదుపులు ఉండే అంశం

అదానీ వ్యవహారంలోని అంశాలు సాదాసీదా విషయం కాదు. ఈ ఆరోపణల్లోని అంశాలు చాలా తీవ్రమైనవి, పలు తీవ్రస్థాయి పరిణామాలకు దారితీస్తాయి. కార్పొరేట్ అక్రమాలు, పలు తప్పిదాలు, రాజకీయ అవినీతికి , షేర్ల విలువల పతనాలుచ తలకిందులు, ఆర్థిక వ్యవస్థ విఘాతానికి దారితీసే అంశాలు ఉంటాయి. పలు రకాల తప్పుడు మార్గాలతో అక్రమ లావాదేవీలకు ఆస్కారం ఏర్పడింది. పైగా ఏకైక కార్పొరేట్ గ్రూప్ కోసం ప్రజా వనరుల దుర్వినియోగం, ఏకఛక్రాధిపత్యం ఆ సంస్థ తప్ప మరో సంస్థ పనికిరాదనే ధోరణి సాగిందని , వీటన్నింటిపైనా విచారణ అత్యవసరం అని ప్రతిపక్ష నేతలు తెలిపారు.

షేర్ల విలువలతో ఆడుకునేందుకు షెల్ కంపెనీలు

అదానీ గ్రూప్ ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు పలు అక్రమాలకు దిగిందని విపక్ష నేతలు తమ లేఖలో తెలిపారు. పలు ఆఫ్‌షోర్ షెల్‌కంపెనీల ఏర్పాటు , వీటి ద్వారా అదానీ గ్రూప్ సంబంధిత ఆఫ్‌షోర్ నిధులు వాడుకుని షేర్ల మార్కెట్‌లో కృత్రిమ విలువలను సృష్టించడం జరుగుతూ వచ్చింది. ఈ గ్రూప్ కంపెనీల ఆర్థిక స్థితి గురించి తప్పుడు చిత్రీకరణలతో ప్రయోజనాలు పొందడం జరిగిందని విపక్ష నేతలు పేర్కొన్నారు.

ముంద్రా పోర్టులో మాదకద్రవ్యాల పట్టివేత సంగతి

2021లో ముంద్రా రేవులో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుకున్న విషయాన్ని కూడా విపక్ష నేతలు ఇప్పటి ఈ లేఖలో తెలిపాయి. ఈ పోర్టు అదానీ నిర్వహణలో ఉందనే తీవ్రస్థాయి అంశం, ఈ గ్రూప్ నిర్వహణలో ఉన్న చోట భారీ స్థాయి అక్రమం జరగడం వంటి వాటిపై ఇంతవరకూ తీవ్రస్థాయిలో ఎటువంటి దర్యాప్తు జరగలేదనే విషయాన్ని తిరిగి ప్రస్తావిస్తున్నామని విపక్ష నేతలు తెలిపారు. ఇక పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అదానీ గ్రూప్ రుణాలు పొందింది. దీని గురించి లెక్కలేదు. ఇది పూర్తిగా అవినీతి, క్రియోనిజం, అదేపనిగా అలవాటుగా చట్టం ఉల్లంఘన అంతకు మించి చట్టానికి, నిబంధనలకు పాతర వంటి చర్యలు జరిగాయని ఆరోపించారు. పలు రకాల ప్రాధమిక విషయాలు ఉన్నా, ఇవి ముందుకు వచ్చినా ఇడి ఈ సంస్థ వ్యవహారాలపై కనీస దర్యాప్తు చేపట్టేందుకు ముందుకు రాలేదని, కనీస ఆసక్తి కూడా చూపలేదని ఇది న్యాయం అనుకుంటున్నారా? తమ విచారణ పరిధిలోకి ఈ అంశాలు రావనుకుంటున్నారా? అని ఇడి డైరెక్టర్‌కు పంపించిన లేఖలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోకసభలో బిఆర్‌ఎస్ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు, ఎంపిలు సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, పి.రాములు,కే.ఆర్.సురేష్ రెడ్డి, బిబి పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, మాతోతు కవిత, బోర్లకుంట వెంకటేష్ నేతకాని, మన్నె శ్రీనివాస్ రెడ్డి, జైరాం రమేష్ (కాంగ్రెస్), వై.గోపాలస్వామి(ఎండిఎంకే)లు పాల్గొన్నారు. అదానీ వ్యవహారంపై తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి, నిజాలను నిగ్గు తేల్చాలని వారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం పార్లమెంట్ నుంచి ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు కాలినడకన బయలుదేరి వెళ్లారు. ర్యాలీలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.

జెపిసి వేయాలని కోరాం : నామా

అదానీపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని, దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపిసి) వేయాలని ఈ సందర్భంగా లేఖలో ఈడీని కోరామని నామ చెప్పారు. ఇది ఎంతో పెద్ద కుంభకోణమని ఆ గ్రూప్‌లో ఎల్‌ఐసి, ఎస్బీఐ, ఇతర బ్యాంకుల పెట్టుబడులు ఉన్నాయని, ప్రభుత్వ ఆస్తుల కొనుగోలుకు ప్రభుత్వం ఒక వ్యక్తికి డబ్బు ఇస్తోందని, గతంలో కొద్దిపాటి వ్యాపారాలు ఉన్న వ్యక్తి అనూహ్యంగా రూ.13 లక్షల కోట్లకు ఎలా ఎగబాకాడని, ఇది ఎలా సాధ్యం ? ఎవరు డబ్బు ఇస్తున్నారని, మోడీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటీ? అని లేఖలో ప్రస్తావించినట్లు నామ తెలిపారు. బిఆర్‌ఎన్, ప్రతిపక్ష నేతల గళాన్ని కేంద్రం అణచివేస్తుందని నామ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం బేషజాలకు పోకుండా తక్షణమే అదానీ అంశంపై జేపిసిని వేసి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని నామ కోరారు. ప్రతిపక్షనేతలపై కావాలని దర్యాప్తు సంస్థల్ని పంపించడం సరికాదని, కేంద్రం తీరు మార్చుకోవాలన్నారు. అదానీ -హిండెన్ బర్గ్ అంశంపై దర్యాప్తు కోసం బిఆర్‌ఎస్, వివక్ష పార్టీలు పట్టుబడుతున్నా ఎందుకు వెనక్కిపోతున్నారని నామ ప్రశ్నించారు.

పుట్టిన రోజున పార్లమెంట్‌లో నామ

బుధవారం పుట్టిన రోజైనప్పటికీ ఎంపి నామ నాగేశ్వరరావు ప్రజల కోసమే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ప్రజల కోసం, తెలంగాణ కోసం ఆయన అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పుట్టిన రోజు వేడులకు దూరంగా ఉండి, పార్లమెంట్ కు హాజరై, ప్రజల కోసం ఉద్యమిస్తుండడంపై సర్వత్రా అభినందనలు వ్యక్తమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News