Home జిల్లాలు పత్తి వద్దే వద్దు

పత్తి వద్దే వద్దు

mbnr* పప్పు ధాన్యాల సాగుతోనే రైతుల అభివృద్ధి
* అందుబాటులో సరిపడా విత్తనాలు
*సహకార కేంద్రాల ద్వారానే సరఫరా, కొనుగోలుకు కృషి
* పాలమూరు అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి
* వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి
* కొందుర్గులో సబ్సిడీపై పప్పు ధాన్యాల విత్త్తనాల సరఫరా
పత్తి సాగు కోసం రైతులు లక్షల రూపాయలు అప్పులు చేసి నష్టపోతూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు. పప్పు ధాన్యాల పంటలను సాగుచేసి అభివృద్ధి చెందాలి’ అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతులకు సూచించారు.
– మన తెలంగాణ/కొందుర్గు
మన తెలంగాణ/కొందుర్గు: ‘పత్తి సాగు కోసం రైతు లు లక్షల రూపాయలు అప్పులు చేసి నష్టపోతూ ఆ త్మహత్యలకు పాల్పడొద్దు. పప్పు ధాన్యాల పంటలను సాగుచేసి అభివృద్ధి చెందాలి’ అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతులకు సూచించా రు. శుక్రవారం ఆయన కొందుర్గు మండల కేంద్రం లో మండల పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వ ర్యంలో పప్పు ధాన్యాల విత్తనాల సరఫరా కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పోచారంతో పాటు వైద్యారోగ్యశాఖ మంత్రి డా. ల కా్ష్మరెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కలెక్టర్ టీకే శ్రీదేవి హాజరై రైతు లకు సబ్సిడీపై పప్పు ధాన్యాల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ రై తు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందన్న ఉద్దే శ్యంతో రైతులకు సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేసేం దుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొం దించినట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రా ష్ట్రంలో రైతులు పంటలు సాగుచేసి తీవ్రమైన అప్పులు ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడటం బాధకరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఇదివరకు అన్ని రకాల పంటలను సాగు చేయడం వ ల్ల క్షేమంగా ఉంటూ పశువులకు కావాల్సిన గ్రాసా న్ని తయారు చేసుకునే వారని, కానీ ప్రస్తుతం పత్తి, మొక్కజొన్న పంటలే సాగు చేయడంతో ఇటు రైతు లు, పశుగ్రాసం లేక పశువులు తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలోనే కరువు జిల్లాగా పేరున్న పాలమూరు జిల్లా రైతు క్షేమం కోసం ము ఖ్యమంత్రి రైతులకు సబ్సిడీపై పప్పు ధాన్యాల విత్తనా లతో పాటు స్పింకర్లు, ట్రాక్టర్లు అందించేందుకు సంకల్పించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే విత్తనాలను సరఫరా చేయనున్నట్లు తెలిపారు. బీసీ, మైనార్టీ, ఓసీలకు 90 శాతం సబ్సిడీపై పప్పు ధాన్యా ల విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నాలుగు కేజీలు ఉన్న బ్యాగులను పంపిణీకి సిద్ధ్దంగా ఉంచినట్లు చెప్పారు. కందులు ఒక కేజీ రూ.62.30, సోయబిన్ రూ.44, పెసర్లు 62, మినుములు రూ. 54.70 ధర నిర్ణయించినట్లు వివరించారు. పీఏసీ ఎస్‌ల ద్వారా కేవలం పంపిణీ మాత్రమే కాకుండా రై తుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు కల్పించేందుకు కృషిచేయాల్సిన అవసరం ఉంద న్నారు. అదేవిధంగా రైతుల కోసం నాణ్యమైన 9 గంటల విద్యుత్‌ను అందిస్తుందని భవిష్యత్ కాలం లో 24 గంటలు అందించేందుకు కృషి చేయనున్న ట్లు తెలిపారు. ఇదివరకు మన ప్రాంతం నుంచి నీరు పారుతున్నా ఆంధ్రా పాలకులు తమ ప్రాంతానికి తరలించి తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన నీటిని మనమే కాపాడుకొని ప్రాజెక్టుల ద్వారా పంటలతో సశ్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే పా లమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచే సేందుకు కృషి చేస్తున్నామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా కొందుర్గు మండలం లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మిస్తే కొందుర్గు, షాద్‌నగర్ ప్రాంతానికి పుష్కలంగా నీరు అందుతుం దన్నారు. కొందుర్గులో బస్టాండ్ పరిస్థితి మరి అ ధ్వానంగా ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, అభివృద్ధ్దికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అవసరమే కానీ కేజీ టు పీజీ విద్యను ప్రవేశపెట్టడానికి తెలంగా ణ ప్రభుత్వం ఆలోచిస్తుండడంతో ఆలస్యమవుతుం దని వివరించారు. కొందుర్గు పీఏసీఎస్ కార్యాల యానికి ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 200 గ్రామాలు బీటీ రోడ్డు లేని గ్రామాలున్నాయని, త్వరలో బీటీగా మార్చేందుకు కృషి చేయడంతో పాటు ప్రతి గ్రామా నికి బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి చెప్పా రు. ప్రతి ఆడబిడ్డ తన పొలంలో పనిచేసుకొని ఇం టికి వచ్చిన తర్వాత బిందే తీసుకొని బయటికి వెళ్ల కుండా ఇంటింటికి నల్లా నీరు, ప్రతి గుంట భూ మికి సాగు నీరు అందించడమే లక్షంగా ముందు కు సాగుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కొందుర్గు మండలాభివృద్ధ్ది అధి కారి యాదయ్య, తహసీల్దార్ పాండు, జిల్లా మత్య సహకార సంఘం అధ్యక్షుడు రావుల బాల్‌రాజ్, వ్యవసాయ శాఖ ఏఈ తబసుమ్, జడ్పీటీసీ బంగారు స్వరూప, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డైరెక్ట ర్లు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, రైతు లు, టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.