Home తాజా వార్తలు వీగిన బోధన్ అవిశ్వాసం

వీగిన బోధన్ అవిశ్వాసం

ph

తీర్మానం ప్రతిపాదించిన 29 మంది కౌన్సిలర్లలో కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురే హాజరు
వారిలోనూ ఒకరు తుది ఘట్టంలో గైర్హాజరు, కోరం లేకపోవడంతో అవిశ్వాసానికి అపజయం

మన తెలంగాణ/ బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్యపై అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం వీగిపోయింది. ఇటీవల సుమారు 29 మంది కౌన్సిలర్లు చైర్మన్ వ్యవహార శైలి పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 34 మంది కౌన్సిలర్లకుగాను 29 మంది చైర్మన్‌కు వ్యతిరేకంగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి అవిశ్వాస లేఖను కలెక్టర్ రామ్మోహన్‌రావ్‌కు అందజేశారు. ఈ నేపథ్యంలో చైర్మన్ బలం నిరూపించుకోవాలని, 25న బలపరీక్ష నిర్వ హించాలని కలెక్టర్ నోటీసులు జారీచేశారు. అవిశ్వాస తీర్మానంపై బుధవారం ఏర్పాటు చేసి న సమావేశానికి పూర్తిస్థాయి కోరం లేకపోవడంతో తీర్మానం వీగిపోయింది. చైర్మన్ పదవిని కాపాడుకునేందుకు ఎంపి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే షకీల్‌లు చకచకా పావులు కదిపా రు. జనరల్ కోటాలో దళితుడిని మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నుకుని ఎల్లయ్యకు పదవిని అప్పగించిన నేపథ్యలో చైర్మన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఎంపి స్పందించి దళిత సంఘాలతో చర్చించి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఎంఐఎం కౌన్సిలర్లను బుజ్జగించారు. చైర్మన్‌కు మద్దతును కూడగ ట్టాలని బిజెపికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు, ఎంఐఎం కౌన్సిలర్లను సముదాయించారు. బుధవారం ఉదయం బలపరీక్ష నిరూపణ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సబ్‌కలెక్టర్ అనురాగ్ జయంత్ సమావేశానలకి కోరం లేకపోవడంతో సమావేశాన్ని మధ్యాహ్నం 2:30 గంటల వరకు వాయిదా వేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అబీద్ అలీ(33), రఫీయొద్దీన్(11),దాము(19), వనిత(18),నక్క విట్టవ్వ(22),చంద్ర కళ(23),రహీమున్నీసా బేగం(29)లు బలపరీక్షకు హాజరయ్యారు. సరైన కోరం లేకపోవడంతో సమావేశాన్ని మధ్యాహ్నానికి సబ్‌కలెక్టర్ వాయిదా వేశారు. ఉదయం సమావేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీకి చెందిన చంద్రకళ అనే కౌన్సిలర్ సైతం మధ్యాహ్నం సమావేశానికి హాజరు కాకుండా అవిశ్వాసానికి దూరంగా ఉన్నారు. మధ్యాహ్నం తిరిగి సమావేశం నిర్వహించినపుడుకూడా కోరం లేకపోవడంతో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు సబ్‌కలెక్టర్ ప్రకటించారు. కాగా బలపరీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.