Home తాజా వార్తలు అమ్మా..! మీ వాడికి బుద్ధ్ది చెప్పాల్సిందే…!

అమ్మా..! మీ వాడికి బుద్ధ్ది చెప్పాల్సిందే…!

 Rogues

 

మహిళల వెంటపడుతున్న పోకిరీలకు కౌన్సెలింగ్
వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే హెచ్చరికలు
షీటీమ్స్ పోలీసుల అదుపులో 48 మంది యువకులు
16 మందిపై నమోదైన కేసులు
అందులో 21మంది మైనర్లు
వాట్సాప్ 9490617111.. డయల్ 100కు ఫిర్యాదులు

హైదరాబాద్ : అమ్మా… మీ వాడి ప్రవర్తన బాగాలేదు. ప్రవర్తనను మార్చుకోవాలి. మీవాడిపై మీరు మరింత దృష్టి పెట్టాల్సిందే. అంటూ రాచకొండ పోలీసులు పోకిరీలకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇక ముందు గ్రేటర్ పరిధిలోని యువకులు, మైనర్‌లూ… తస్మాత్ జాగ్రత్త…! మహిళల వెంటపడుతున్నారా..? యువతులను ప్రేమిస్తున్నామని వేధిస్తున్నారా..?
బుద్ధి చెప్పాలిందే సన్నిహితంగా తిరిగిన ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా..? అయితే, మీపై షీ టీమ్స్ పోలీసుల దృష్టిపడినట్టే. మీరు జైలుకెళ్ళడం ఖాయం. మీపై వాట్సాప్‌లోనో, ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లోనో షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేరి ఉంటుంది. వారు మీ కదలికలపై నజర్ పెట్టే ఉంటారు.

మిమ్మల్ని ఎప్పుడైనా అదుపులోకి తీసుకోవచ్చు. అందుకే వేధించే, వెంటపడే, బ్లాక్‌మెయిల్ చేసే గుణాలను యువత మానుకోవాల్సిందే. ఇదీ గ్రేటర్ పరిధిలో షీటీమ్స్ మహిళలకు కల్పిస్తున్న భద్రత. మహిళలు నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్ళకుండానే ఫిర్యాదులు చేసే వెసులుబాటును కల్పిస్తూ షీ టీమ్స్ ప్రత్యేకంగా సోషల్ మీడియా గ్రూపులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే శనివారం 42 మంది పోకిరీ(యువకులు)లకు రాచకొండ పోలీసులు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళలను పలు రకాలుగా వేధిస్తున్న వారికి వారి కుటుంబ సభ్యుల ముందరనే షీ టీమ్స్ బృందాలు కౌన్సెలింగ్‌ను ఎల్‌బినగర్‌లోని రాచకొండ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో కౌన్సెలింగ్ చేశారు.

16 మందిపై ఎఫ్‌ఐఆర్, 17 మందిపై పెట్టి కేసులు నమోదు చేశారు. మరో 9 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి, హెచ్చరించారు. గత మూడు వారాల్లోనే 48 మందిని అదుపులోకి తీసుకోగా అందులో 27 మంది మేజర్లతో పాటు 21మంది మైనర్లు ఉండటం గమనార్హం. పోకిరీలకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో భూమిక ఉమెన్స్ కలెక్టివ్(ఎన్‌జిఓ) అనే స్వచ్చంద సంస్థ ప్రతినిధులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సైకియాట్రిస్ట్ వాసవి వారి ప్రవర్తన మార్చుకోవాలని చెప్పారు.

వివాహం చేసుకుంటానని వేధించిన యువకుడిపై షీ ఫర్ హర్ వలంటీర్ ఫిర్యాదు చేయడంతో అతడిపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రాచకొండ పోలీసులు డెకాయి ఆపరేషన్, వాట్సాప్, ఎస్‌ఎంయూసి ద్వారా వచ్చిన ఫిర్యాదుల మేరకు వారిని అరెస్టు చేశారు. షీటీమ్స్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు. ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ నంబర్ 9490617111, డయల్ 100కు కాల్ చేయాలని కోరారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను….
సరూర్‌నగర్‌లో ఉంటున్న ఓ యువతి నగరంలోని గూగుల్ సంస్థలో పనిచేస్తున్నది. జూబ్లీహిల్స్‌కు చెందిన రహ్మత్ ఖాన్( గూగుల్‌లో ప్రాసెస్ అనలిస్ట్) కూడా అక్కడే పనిచేస్తున్నాడు. వివాహం చేసుకుంటానని ఆ యువతి వెంటపడ్డాడు. 2018, జూన్‌లో యువతిని తన ఇంటికి తీసుకెళ్ళిన రహ్మత్ వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక కోరిక తీర్చుకున్నాడు. అప్పటి నుంచి రహ్మత్ తరచూ యువతి ఇంటికి వచ్చేవాడు.

ఈ క్రమంలో యువతికి తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని చూపించి యువతిని డబ్బులు ఇవ్వాల్సిందిగా బ్లాక్‌మేయిల్ చేయడం ప్రారంభించాడు. జనవరి, 2019 నుంచి చిన్ని చిన్న విషయాలకు గొడవపెట్టు కోవడం చేస్తూ క్రమంగా దూరమయ్యాడు. తర్వాత కొద్ది రోజులకు వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో యువతి తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

వివాహం చేసుకోమని…
కుషాయిగూడకు చెందిన యువతికి జగిత్యాలకు చెందిన హరీష్ అక్కిరెడ్డి 2015లో పరిచయమయ్యాడు. తను చేస్తున్న కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. నవంబర్, 2015లో తను పనిచేస్తున్న సంస్థలో ఉద్యోగం ఇప్పించాడు. కొద్ది రోజుల తర్వాత తనను వివాహం చేసుకోవాలని వేధించడం ప్రారంభించాడు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆరు నెలల్లోనే ఉద్యోగాన్ని వదిలివేసింది. 2018, ఫిబ్రవరిలో యువతికి తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు పంపించాడు.

దీంతో అనుమానం వచ్చిన యువతి హరీష్ గురించి విచారణ చేయగా అతడికి అప్పటికే వివాహమైనట్లు తెలిసింది. అసలు విషయం తెలియడంతో పూర్తిగా పక్కకు పెట్టింది. ఆగ్రహంతో ఫొటోలు మీ బంధువులకు, తల్లిదండ్రులకు పంపిస్తానని బ్లాక్ చేయడం ప్రారంభించాడు. బాధితురాలు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇబ్రహింపట్నంలో డెకాయి ఆపరేషన్…
షీటీమ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన ఇబ్రహిపట్నం బస్‌స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చెపట్టిన డెకాయి ఆపరేషన్‌లో ఇద్దరు మైనర్లు పట్టుబడ్డారు. పాఠశాలల పిల్లలను టీజింగ్ చేస్తుండగా వారిని పట్టుకున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.

Counseling for Women’s pursuing Rogues