Saturday, July 19, 2025

పిల్లలకు కుటుంబం, సమాజంపై బాధ్యత తెలిసేలా కౌన్సిలింగ్: సిఎం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. సిఎం విద్యాశాఖపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలని తెలిపారు. విద్యార్థులకు (Students) భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లేఅవుట్లలో ప్రజల అవసరాల కోసం కోటాయించిన స్థలాల్లో బడులు నిర్మించాలని ఆదేశించారు. గురుకులాల తరహాలో సౌకర్యాల కల్పనపై అధ్యయనం చేయాలని సూచించారు. డేస్కాలర్లకూ భోజనం, యూనిఫామ్, పుస్తకాల సరఫరాపై అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. పిల్లలకు కుటుంబం, సమాజంపై బాధ్యత తెలిసేలా కౌన్సిలింగ్ ఇప్పించాలని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News