Home ఆంధ్రప్రదేశ్ వార్తలు మూన్ యాన్-2

మూన్ యాన్-2

Chandrayaan-2

సోమవారం మధ్యాహ్నం 2.43గం.కు ప్రయోగం
విజయం తథ్యం : శివన్

దేశమంతటా ఉత్కంఠ..ఏ ఫలితం తేలని క్రికెటంత ఉత్కంఠ. ఇప్పుడు చంద్రయాన్ 2 దశలో దేశవ్యాప్తంగా ప్రపంచసమస్తంగా నెలకొంది. మ్యాచ్‌లో చివరి ఓవర్లో అన్నట్లు గత వారం కౌంట్‌డౌన్ దశలో
చంద్రయాన్ ప్రయోగానికి బ్రేక్ పడింది. చంద్రుడి వద్దకు మువ్వన్నెల భారతీయ జెండాను తీసుకువెళ్లగల్గుతామా? వాతావరణ అనుకూలత ప్రతికూలతతో నిమిత్తం లేకుండా, సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని
సంతరించుకుని పలు కీలక పరీక్షలకు తట్టుకుని నిలిచిన శక్తివంతమైన బాహుబలి రాకెట్ జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 ప్రయోగం విజయవంతం అయితే మరో మూడు దేశాల సరసన నిలిచి ఖండాంతర, ఖగోళాం తర ఖ్యాతిని దక్కించుకుంటుంది. కౌంట్‌డౌన్ తరువాతి ప్రయోగ దశ లలో ఎదురయ్యే అత్యంత సున్నిత, సంక్లిష్ట దశలను దాటుకుని బాహు బలి ప్రయాణం నిర్ణీత కక్షలోకి దూసుకువెళ్లితే చంద్రుడి వద్దకు మన ప్రయాణం సెప్టెంబర్ 6వ తేదీ నాటికి చేరుకోవడం తథ్యం అవుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇస్రో పునః ప్రయత్నంపై దృష్టి సారించింది. కౌంట్‌డౌన్ దశలో తీవ్రస్థాయిలో భారతీయులలో ఉత్కంఠల ఉద్విగ్నతల కౌంట్‌డౌన్ ఆరంభం అయింది. ఇతర దేశాల ప్రయోగాలతో పోలిస్తే తక్కువ వ్యయభారం. అంతకు మించిన పలు సత్ఫలితాల లక్షం. మానవాళికి అత్యవసరమైన పలు ప్రయోజనకర అంశాలపై విస్తృత పరి శోధనల సమాహారంగా మారిన చంద్రయాన్ కేవలం ఇస్రో సాగిస్తున్న శాస్రీయ ప్రయోగమే కాకుండా జాతి మొత్తం ఆశిస్తున్న విజయవంత నిర్ణీత లక్షపు ఆశగా మారింది.

చందమామ కథగా మిగలదు. చంద్రుడిలోని వెలుగునీడలు, ఎత్తుపల్లాలు, చంద్రుడి అత్యంత శీతల కిరణాలు ఇవన్నీ భువికి అందించే కీలక సందేశాలు ఏమిటీ? ఇవి మానవాళి గతిని మార్చే సంకేతాలు అవుతాయా? అనేది తేల్చుకోవడానికి మరో రెండు మూడేళ్లలో మన దేశ మానవుడికి నింగిలోని చంద్రుడి వద్దకు చేర్చే క్రమంలో సాగే యాత్ర గడిచిన వారంలాగా మధ్యలో నిలిచిపోరాదనే ఆకాంక్షలతో జనం ఎదురుచూస్తున్నారు. ఏళ్ల తరబడి సాగుతూ వస్తున్న భారత శాస్త్రజ్ఞుల, ఇస్రో సాంకేతిక సిబ్బంది సమిష్టి కృషికి ఫలితం కోసం అంతా ఎదురుచూస్తున్నారు. కౌంట్‌డౌన్ గంటలు నిమిషాలు సెకన్లు దాటుతున్న కొద్దీ చంద్రుడి ని గెల్చుకునే ఆటలో భారతదేశ విజయం ఖాయం అవుతుందనే విశ్వాసాలు, శతకోటానుకోట్ల భావోద్వేగాల స్పందన భువి నుంచి దివిలోని చంద్రుడి చెంతకు చేరుతుందా? చంద్రవిజయం భారతీయ సొంతం అవుతుందా? అనేది సోమవారం మధ్యాహ్యానికి వెల్లడవుతుంది. బాల్ భూగోళం దాటి ఖగోళం చుట్టి చంద్రుడిని చేరి భారతీయ ఇస్రో మ్యాచ్‌లో సూపర్‌హిట్ అవుతుందా? అనేది నేడే చంద్రుడి కాంతిలాగా తేటతెల్లం కానుంది.

బెంగళూరు : శ్రీహరికోట్ల షార్ నుంచి చంద్రయాన్ 2 ప్రయోగానికి ఆదివారం సాయంత్రం 20 గంటల కౌంట్‌డౌన్ ఆరంభం అయింది. 3850 కిలోల బచువుండే చంద్రయాన్2లో మూడు భాగాలు కీలకంగా ఉంటా యి. ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌లు చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకుంటాయి. ఇస్రో మొదటి చంద్రయాన్ తరువాత 11 సంవత్సరాలకు చంద్రయాన్ 2 ప్రయోగం జరుగుతోంది. చంద్రయాన్ 1 ద్వారా చంద్రుడి చుట్టూ 3400 కక్ష్యా వలయాల్లో ఉపగ్రహం పరిభ్రమించింది. దీని కాలపరిమితి 2009 ఆగస్టు 29తో ముగిసింది. దీనిని పరిగణనలోకి తీసుకునే ఇప్పుడు మానవరహిత చంద్రయాన్2 ప్రయోగం చేపట్టారు. దీని ద్వారా అత్యం త నిర్ణీత కక్షలలో ల్యాండర్ చంద్రుడిపైకి చేరడానికి 48 రోజులు పడుతుంది. ఈ కోణంలో చూస్తే సెప్టెంబర్ 6వ తేదీ నాటికి చంద్రుడిపైకి చేరుతుంది. ఇది మానవ రహి త చంద్రమండల యాత్ర. 2022లో భారతదేశం తలపెట్టిన మానవసహిత చంద్రయాత్రకు సన్నాహాక ప్రక్రియ గా ఇప్పటి చంద్రయాన్ 2ను విశ్లేషిస్తున్నారు. ఇస్రో ప్రయోగాలు అత్యధికం విజయవంతం కావడం, ఇప్పు డు ప్రయోగవాహక నౌక జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 ఇస్రోకు నమ్మినబంటుగా ఇంతుక ముందు మూడు దఫాలు ప్రయోగాలను విజయవంతం చేయడం, నిర్ణీత కక్షల్లోకి ఉపగ్రహాలను పంపించడంతో ఈ వాహక నౌకకు ఇస్రో శాస్త్రజ్ఞులు బాహుబలి అని, నమ్మినబంటు అని, దిగ్గజం అని పేర్లు పెట్టారు.

ఒకటి రెండు సార్లు నిర్ణీత సమయానికి చంద్రయాన్2 ప్రయోగాన్ని నిర్వహించలేకపొయ్యా రు. ఇక గత వారం కౌంట్‌డౌన్ దశలోనే క్రయోజనిక్ ఇంజిన్‌లో లీకేజీ సమస్యతో ప్రయోగాన్ని అర్థాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు ఎటువంటి సాంకేతిక సమస్యలు, మొరాయింపులు లేకుండా ఈ రాకెట్ నుంచి బరువుండే ఉపగ్రహాన్ని, ఇతర అనుసంధాన వ్యవస్థలను కక్షలోకి చేర్చేందుకు రంగం సిద్ధం అయింది. చంద్రుడు తరతరాలుగా భారతీయుల ఆశల కలలపంటగానే ఉంటూ వచ్చారు. చంద్రుడి గురించి చిన్ననాటి నుంచి వినబడే కథలు, చంద్రుడిలోని అద్భుతాలకు సూచికలుగానే నిలుస్తూ వచ్చాయి. ఇప్పుడు ఇస్రో తొలి చంద్రయాన్ 1 ప్రయోగదశలో చంద్రుడిపై నీటి ఉనికిని నిర్ణీతంగా గుర్తించింది. దీనిని ఇప్పుడు చంద్రయాన్ 2 ద్వారా సరై న రీతిలో విశ్లేషించుకునేందుకు ఇస్రో చేస్తున్న ప్రయ త్నం ఫలిస్తుందనే ఆశలు మిన్నంటాయి. ఇప్పుడు ఆ తరువాత 2020, 2021లలో మానవ రహిత చంద్రయాత్రలను తలపెట్టి, సరైన ప్రాతిపదికను ఏర్పాటు చేసుకుని సమగ్రమైన రీతిలో 2022లో చంద్రుడి వద్దకు మానవుడిని పంపించేందుకు చంద్రమండల సంపూర్ణ యాత్రకు ఇస్రో రంగం సిద్ధం అవుతోంది.
నాలుగు దేశాల సరసకు
ఇంతకు ముందటి జిఎస్‌ఎల్‌వి మార్క్ 2తో పోలిస్తే ఇప్ప టి మార్క్ 3 అత్యంత గణనీయమైనదిగా రికార్డులలో చేరింది. అంతకు ముందటి పిఎస్‌ఎల్‌వి రాకెట్లు కూడా భారతీయ ప్రతిష్టను నిలబెట్టాయి. ఓ వైపు ఇతర దేశాల స్పేస్ ఎక్స్, రష్యాకు చెందిన సోయుజ్‌లు విఫలం అయిన దశలో పిఎస్‌ఎల్‌వి రాకెట్ల నుంచి 46 ప్రయోగా లు విజయవంతం అయ్యాయి. ఇస్రో అత్యంత సృజనాత్మక ప్రయోగాలను విజయవంతం చేసిందని ప్రత్యేకించి అంగారకుడు, చంద్రుడి వద్దకు చేపట్టిన ప్రయోగాలు కీలకమైనవని ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె కస్తూరి రంగన్ పేర్కొన్నారు. ప్రస్లుతం ఇస్రో ప్రపంచాని కి ఈర్షపుట్టిస్తూ, భారత్‌కు గర్వకారణంగా నిలుస్తోందన్నారు. విఫలాల నుంచి తిరిగి విజయాల వైపు పయనించే సత్తా ఇస్రో సంతరించుకుంది. ప్రత్యేకించి స్వదేశీపరిజ్ఞానపు క్రయోజనిక్ ఇంజిన్లు ఇతర దేశాల ఇంజిన్లతో పోలిస్తే అత్యంత సమర్థదంతంగా వ్యవహరిస్తున్నాయి.

Countdown for rocket take off going smoothly