Thursday, March 28, 2024

ప్రమాదంలో దేశ ఆర్థికవ్యవస్థ : చిదంబరం

- Advertisement -
- Advertisement -

Chidambaram

చెన్నై: దేశ ఆర్థిక వవస్థ ప్రమాదకరపరిస్థితిలో ఉందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ దేశం ఆర్థికపరిస్థితి మందగమనంలోనే ఉందన్నారు. తమిళనాడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. దేశంలో ఓ వర్గం అభివృద్ధి చెందుతుంటే, మరో వర్గం ఆర్థికంగా దిగజారిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో కేవలం 10 శాతం మందికి మాత్రమే ఆదాయం పెరిగిందన్నారు. కాగా 40 శాతం మంది పతనావస్థకు, మిగిలిన 50 శాతం మంది కష్టాల్లో కూరుకున్నారని తెలిపారు.

అంతర్జాతీయంగా నెలకొని ఉన్న ఆర్థిక మందగమనం వచ్చే ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉందన్నారు. దేశ ఆర్థిక మందగమనం మరో తొమ్మిది నెలలపాటు కొనసాగగలదన్నారు. ఒకవేళ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక మందగమనం నుంచి బయటపడొచ్చని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారని, ఒకే వస్తువుపై 33 శాతం పన్ను విధించడమంటే, బలవంతపు పన్ను వసూలేకాగలదన్నారు. కేంద్ర ప్రభుత్వ దురాశతనం ఇట్టే తెలిసిపోతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News